Brahmanandam: హాస్య బ్రహ్మ ఇంట పెళ్లి సందడి.. ఘనంగా రెండో కొడుకు నిశ్చితార్ధ వేడుక

టాలీవెడ్‌ లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్‌ నిశ్చితార్ధం జరిగింది..

Brahmanandam: హాస్య బ్రహ్మ ఇంట పెళ్లి సందడి.. ఘనంగా రెండో కొడుకు నిశ్చితార్ధ వేడుక
Brahmanandam 2nd Son Engagement
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 10:47 AM

టాలీవెడ్‌ లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్‌ నిశ్చితార్ధం జరిగింది. సిద్దార్ధ్‌కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. గౌతమ్‌కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే బ్రహ్మీ చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తుండటంతో అతని గురించి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. నిజానికి సిద్దార్థ్ కూడా హీరో మెటీరియలే. ఐతే అతనికి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ఇక కొత్త జంట సిద్దార్థ్- ఐశ్వర్య పెళ్లి త్వరలోనే జరగనుంది. ఈ వివాహాన్ని బ్రహ్మీ అంగరంగ వైభవంగా చేయనునన్నట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికొస్తే.. బ్రహ్మానందం ఇటీవల విడుదలైన రంగమార్తాండ మువీలో చివరిగా కనిపించాడు. ఆరోగ్య కారణాల వల్ల ఇంటి పట్టున ఎక్కువగా ఉంటున్నట్లు టాక్‌. బ్రహ్మానందం తెరపై కామెడీ పండించడంలోనే కాకుండా డ్రాయింగ్‌లో కూడా మన హాస్య బ్రహ్మ సిద్ధహస్తులు. పుస్తకాలు సైతం రాస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.