AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj-Koti: మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటారు.. స్నేహితుడి మరణంపై కోటి ఎమోషనల్‌

ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్నేహితుడు కోటి ఎమోషనల్‌ అయ్యారు. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ జీవించి ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. 'నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా..

Raj-Koti: మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటారు.. స్నేహితుడి మరణంపై కోటి ఎమోషనల్‌
Raj Koti
Basha Shek
|

Updated on: May 22, 2023 | 8:30 AM

Share

రాజ్- కోటి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ దిగ్గజ ద్వయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 180కు పైగా సినిమాలకు కలిసే స్వరాలు సమకూర్చారీ సంగీత దర్శకులు. ప్రళయ గర్జన(1983)తె మొదలైన వీరి ప్రస్థానం ఉదయం, లేడీ జేమ్స్‌బాండ్‌, పున్నమిరాత్రి, మదన గోపాలుడు, యముడికి మొగుడు, ఖైదీ నెం.786, రౌడీ నెం. 1, త్రినేత్రుడు, విక్కీ దాదా, కొదమ సింహం, కొండవీటి రౌడీ, ముఠామేస్త్రి, హలో బ్రదర్స్ వంటి హిట్‌ సినిమాలకు బాణీలు అందించారు. అయితే ఎందుకోగానీ రాజ్‌- కోటిల మధ్య విభేదాలు తలెత్తాయి. విడిపోయి ఎవరికి వారు సినిమాలు చేశారు. అయితే ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్నేహితుడు కోటి ఎమోషనల్‌ అయ్యారు. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ జీవించి ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఈవెంట్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టు రాజ్ నాకు చెప్పలేదు. అలాంటిది హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. రాజ్- కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు కోటి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి, పవన్‌ సంతాపం..

ఇక రాజ్‌ మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ రాజ్‌ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ ఉన్న రాజ్‌, నా చిత్రాల కందించిన బాణీలు, నా సినిమా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్‌ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. రాజ్‌ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఇక రాజ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేన పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే