AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు రూ.1లక్ష సంపాదించే జాబ్‌ ఆఫర్‌..! ఆ వీడియోలు 1 గంట చూస్తే చాలు..

మీరు ఆ జాబ్‌కు ఉత్తమంగా సరిపోతారని మీరు ఎందుకు నమ్ముతున్నారో వివరించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ముఖ్యంగా TikTok ప్లాట్‌ఫారమ్‌పై, దాని ట్రెండ్‌లపై మంచి అవగాహన కలిగి ఉండాలి. పాల్గొనేవారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లలో షేర్ చేయాలి. అలానే కంపెనీని ట్యాగ్ చేయాలి.

రోజుకు రూ.1లక్ష సంపాదించే జాబ్‌ ఆఫర్‌..! ఆ వీడియోలు 1 గంట చూస్తే చాలు..
Tiktok
Jyothi Gadda
|

Updated on: May 23, 2023 | 5:38 PM

Share

స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు. ఇంటర్‌నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోవటంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అందరికీ ఇష్టమైన ప్రదేశాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ సమయం సోషల్ మీడియాపైనే గడుపుతారు. అలాంటి వారి కోసం ఓ కంపెనీ అద్భుతమైన ఉద్యోగ ఆఫర్‌ ప్రకటించింది. అందుకు కావాల్సిన అర్హతలు…మీకు టిక్‌టాక్‌ వీడియోలను గంటలపాటు చూసే అలవాటు ఉంటే సరిపోతుంది. ఆ అలవాటే ఇప్పుడు మీకు వేల రూపాయలను తెచ్చిపెడుతుంది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ యుబిక్విటస్ ద్వారా ఈ ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ పని చేసేవారికి గంటకు $100 (సుమారు రూ.8,290) చెల్లిస్తుంది. ఈ విధంగా మీరు రోజుకు రూ.82,905 వరకు సంపాదించే ఛాన్స్‌ కొట్టేయొచ్చు.

ముందుగా మీరు రు యూట్యూబ్‌ లోని యుబిక్విటస్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి. మీరు ఆ జాబ్‌కు ఉత్తమంగా సరిపోతారని మీరు ఎందుకు నమ్ముతున్నారో వివరించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ముఖ్యంగా TikTok ప్లాట్‌ఫారమ్‌పై, దాని ట్రెండ్‌లపై మంచి అవగాహన కలిగి ఉండాలి. పాల్గొనేవారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లలో షేర్ చేయాలి. అలానే కంపెనీని ట్యాగ్ చేయాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 31, ఎంపికైన అభ్యర్థులకు దరఖాస్తు గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తెలియజేయబడుతుంది.

బీజింగ్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ మీడియా యాప్‌లలో ఇది ఒకటి. భారతదేశంలో టిక్ టాక్ నిషేధించబడింది. Tik Tok ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో అందుబాటులో ఉంది. అయితే, టిక్ టాక్ అనేది మన దేశంలో మాత్రం నిషేధంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..