నోరూరించే జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా..? కొద్ది మందికి మాత్రమే తెలిసిన సంగతిది..!

చక్కగా గుండ్రంగా, తీపిగా, కరకరలాడే రుచితో ఉండే జిలేబీని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. మీరు ఖచ్చితంగా ఈ వంటకాలన్నీ తినే ఉంటారు, కానీ ఈ జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మందికి ఈ ఆహారపదార్థాల ఇంగ్లీష్‌ పేర్లు తెలియవు. కాబట్టి ఇంగ్లీషులో జిలేబిని ఏమంటారో తెలుసుకుందాం.

నోరూరించే జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా..? కొద్ది మందికి మాత్రమే తెలిసిన సంగతిది..!
Jilebi
Follow us
Jyothi Gadda

|

Updated on: May 22, 2023 | 9:49 PM

ఎప్పుడైనా, ఎవరికైనా ఇష్టమైన స్వీట్‌ జిలేబీ. అయితే ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా జలేబీని తయారు చేసింది. అంతేకాదు..జలేబీని ప్రపంచం మొత్తం ప్రేమిస్తుంది. ఎదురుగా జిలేబీని చూడగానే నోటిలో వేసుకోవాలనే తాపత్రయాన్ని ఆపుకోలేరు చాలా మంది. అన్ని మిఠాయిలు ఒకవైపు. జిలేబీ ఒక్కటే ఒకవైపు నిలుస్తుంది. అలా జలేబి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చక్కగా గుండ్రంగా, తీపిగా, కరకరలాడే రుచితో ఉండే జిలేబీని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. రాబడీని జిలేబితో తింటే, కొన్ని చోట్ల పాలు, పెరుగు కలిపి తింటారు. మీరు ఖచ్చితంగా ఈ వంటకాలన్నీ తినే ఉంటారు, కానీ ఈ జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మందికి ఈ ఆహారపదార్థాల ఇంగ్లీష్‌ పేర్లు తెలియవు. కాబట్టి ఇంగ్లీషులో జిలేబిని ఏమంటారో తెలుసుకుందాం.

జిలేబిని ఇంగ్లీష్‌లో ఏమంటారు..?

ఇక్కడ మీ అందరికీ ఇష్టమైన వంటకం జిలేబీతో ప్రారంభిద్దాం. నెయ్యి, నూనె, పిండి, పంచదార వంటి వివిధ పదార్థాలతో జిలేబీని తయారు చేస్తారు. వేడుకల సందర్భంగా జిలేబీని చాలా మంది తింటారు. వివాహ వేడుకలో చాలా మంది తినడానికి మొదటి ఎంపిక జిలేబీ. అయితే ఈ జిలేబికి ఇంగ్లీషులో పేరేంటి? చాలామందికి సమాధానం త్వరగా గుర్తుండదు. జిలేబీని ఆంగ్లంలో రౌడెడ్ స్వీట్ లేదా ఫన్నెల్ కేక్ అంటారు. కొంతమంది జలేబీని స్వీట్‌మీట్ లేదా సిరప్ ఫిల్డ్ రింగ్ అని కూడా పిలుస్తారు.

జిలేబీకి వేర్వేరు పేర్లు ఉన్నాయి..

దక్షిణ భారతదేశంలో ‘జిలేబి’గా పిలిచే ఈ వంటకాన్ని ఉత్తర భారతదేశంలో ‘జలేబి’ అని పిలుస్తారు. బెంగాల్‌లో ఈ పేరు ‘జిల్పీ’గా మారింది. గుజరాత్‌లో దసరా, ఇతర పండుగల సమయంలో జిలేబీని ఫఫ్దాతో తినడం ఆనవాయితీ. అనేక రకాల జిలేబీ వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. ఇండోర్ మార్కెట్‌లో, బెంగాల్‌లో ‘మోతీ జిలేబీ’, ‘చానర్ జిల్పీ’, మధ్యప్రదేశ్‌లో ‘మావా జిలేబీ’, హైదరాబాద్‌లో ‘ఖోవా జిలేబీ’, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ‘ఇమర్తి’ లేదా ‘జంగిరి’. దీనికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..