రీల్స్ కోసం రాక్షసుడిగా మారిన యువకుడు.. కనిపిస్తే చెప్పండి.. పోలీసుల రిక్వెస్ట్..

అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు. వైరల్ వీడియోలో కనిపించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా యువకుడిని గుర్తించారు. అతనిపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో 20 నుండి 25 రోజుల పాతదని తెలిసింది.

రీల్స్ కోసం రాక్షసుడిగా మారిన యువకుడు.. కనిపిస్తే చెప్పండి.. పోలీసుల రిక్వెస్ట్..
Plucked Peacock Feathers
Follow us
Jyothi Gadda

|

Updated on: May 22, 2023 | 7:42 PM

రీల్స్‌ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు రీల్స్‌ చేస్తూ ప్రాణాలు కూడా కొల్పోయిన సంఘటనలు అనేకం చూశాం. ఇంకొందరు రీల్స్‌, వ్యూస్‌ కోసం మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటిదే ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. రీల్స్‌ చేస్తూ కొందరు యువకులు నోరులేని అందమైన పక్షి నెమలిని చిత్ర హింసలకు గురిచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మధ్యప్రదేశ్‌లోని కట్నీ నుండి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు క్రూరమైన రీతిలో నెమలి ఈకలను పీకేయటం కనిపిస్తుంది. ఈ యువకుడు చేస్తున్న పనిని చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వైరల్ వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన వీడియోలో, ఒక యువకుడు కనికరం లేకుండా నెమలిని హింసిస్తున్నాడు. అంతేకాదు అతని చుట్టూ నెమలి ఈకలు కుప్పగా పడి ఉండటం కూడా వీడియోలో కనిపిస్తోంది. యువకుడు కెమెరా వైపు చూపిస్తూ నవ్వుతూ రాక్షసానందం పొందుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కిరాతక చర్యకు పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అందిన సమాచారం మేరకు వైరల్ వీడియో ఆధారంగా యువకుడిని అటవీశాఖ గుర్తించింది. అతని పేరు అతుల్ కొహనేగా గుర్తించారు. ఈ వీడియోను అతుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్‌గా అప్‌లోడ్ చేశాడు. వ్యూస్‌ కోసమే ఇలా చేశాడని తేలింది. ఆ తర్వాత నెమలిని చంపేసి వండుకు తిన్నాడంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు. వైరల్ వీడియోలో కనిపించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా యువకుడిని గుర్తించారు. అతనిపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో 20 నుండి 25 రోజుల పాతదని తెలిసింది.. నిందితుడైన యువకుడు కట్ని జిల్లాలోని రేతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతను గత 20 రోజులుగా ఇంటి నుండి పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. నిందితుడి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్టుగా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!