AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G7 సదస్సులో మోదీ ధరించిన జాకెట్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా..? సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం..

జీ7 సదస్సు సందర్భంగా వెళ్లిన మోదీ.. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, హిరోషిమాలోని పీస్‌ మెమోరియల్‌లో పర్యటించినప్పుడు మోదీ వేసుకున్న జాకెట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ జాకెట్ సాదాసీదాగా తయారు చేసింది కాదట..! ఇది చాలా ప్రత్యేకత కలిగి ఉంది.

G7 సదస్సులో మోదీ ధరించిన జాకెట్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా..? సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం..
Pm Modi Wore The Jacket
Jyothi Gadda
|

Updated on: May 22, 2023 | 5:36 PM

Share

ఇటీవల జపాన్‌లో జరిగిన జీ7 సదస్సులో పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. జీ-7 కూటమి వార్షిక సదస్సు, మూడో వ్యక్తిగత క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంమే జపాన్ లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రపంచ నాయకులతో ప్రపంచ సవాళ్లపై అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు వాటిని సమిష్టిగా పరిష్కరించే మార్గాలపై చర్చించారు. జీ7 సదస్సు సందర్భంగా వెళ్లిన మోదీ.. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, హిరోషిమాలోని పీస్‌ మెమోరియల్‌లో పర్యటించినప్పుడు మోదీ వేసుకున్న జాకెట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ జాకెట్ సాదాసీదాగా తయారు చేసింది కాదట..! ఇది చాలా ప్రత్యేకత కలిగి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నరేంద్ర మోదీ సదారి జాకెట్ లుక్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. అయితే ఈసారి హిరోషిమాలోని పీస్ మెమోరియల్ మ్యూజియం సందర్శించినప్పుడు ధరించిన జాకెట్ మరింత ప్రత్యేకమైనది. ఇక్కడ మోదీ రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేక జాకెట్ ధరించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో ఈ సదారి జాకెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది.

ఈ జపాన్ పర్యటన సందర్భంగా ఆయన హిరోషిమాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇకపోతే, మోదీ విదేశీ పర్యటన ఎప్పుడూ చర్చనీయాంశమే. వారు ఎల్లప్పుడూ భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేస్తూ కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..