Watch: ఇదెక్కడి క్రియేటివిటీ నాయన.. ఇలాంటి వంటకాలు చూస్తే ఇక జీవితం మీద విరక్తి ఖాయం..!

అయితే చాలా మంది వినియోగదారులు చాలా ఫన్నీ కామెంట్స్ చేశారు. కొంతమంది వినియోగదారులు ఈ వంటకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూసి ఇదేం ప్రయోగంరా బాబు అంటూ మరికొందరు నెటిజన్లు తలబాదుకుంటున్నారు.

Watch: ఇదెక్కడి క్రియేటివిటీ నాయన.. ఇలాంటి వంటకాలు చూస్తే ఇక జీవితం మీద విరక్తి ఖాయం..!
Ice Cream In Chole Bhature
Follow us
Jyothi Gadda

|

Updated on: May 22, 2023 | 3:00 PM

చాలామంది ఆహార ప్రియులు ఎన్నో రకాల వంటకాలను ట్రై చేస్తుంటారు. అటువంటి వాళ్లలోనే కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారు. మరి అలాంటి కొన్ని వంటకాలు మనల్ని ఆశ్చర్య పరిచేవిగా ఉంటే, మరికొన్ని వింత ఆహారపదార్ధాలు నెటిజన్లకు విరక్తిని కూడా కలిగించేవిగా ఉంటాయి. అలాంటి అనేక వింత ఆహారాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు దానికి మరో కొత్త రకం, వింత వంటకం చేరింది. ఆహార ప్రియులకు కొత్త రుచులను అందించేందుకు పలు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ విభిన్న వంటకాలతో ప్రయోగాలు చేస్తున్నాయి. కొంతమంది మ్యాగీ, సమోసా, మోమోస్‌కు ఓక్రాను కలిపి విభిన్నమైన రుచితో కొత్త వంటకం తయారు చేస్తుంటే.. మరికొందరు మ్యాగీకి ఐస్‌క్రీమ్‌ను మిక్స్ చేస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడ మంచి మంచి వంటకాలు కూడా చేస్తుంటారు. రోజువారి ఆహారంతో విభిన్నంగా చేయడంలో ప్రజలు ఎప్పటికప్పుడు తమలోని ప్రతిభను బయటపెడుతుంటారు. అలాంటి ఫుడ్ ఫ్యూజన్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సారి చోలే భాతురేలో ఒక విక్రేత మరో వంటకాన్ని మిక్స్ చేస్తున్నాడు. ఇతడు చేసిన వంటకం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా మందిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

చోలే భాతురే మనలో చాలా మందికి ఇష్టమైన వంటకం. సీజన్‌తో సంబంధం లేకుండా, చోలేను ఇష్టపడుతుంటారు. కానీ, మనకు ఇష్టమైన వంటకంపై వింత ప్రయోగాలు చేస్తుంటారు కొందరు విక్రేతలు. చాక్లెట్ మోమోస్, గులాబ్ జామ్ పరాఠా, ఓరియో మ్యాగీ తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ చోలే-భటురే మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది చూసిన చోలే-భటురే ప్రేమికులు తీవ్రంగా స్పందించారు. అయితే, ఈ ఐస్‌క్రీమ్‌ను జీడిపప్పు, బాదంపప్పు వేసి కాకుండా చోలే వేసి తయారు చేశారు. దీని కోసం విక్రేత మొదట భాతూరే పూరీలను కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. తర్వాత దానిమీద చోలే, చట్నీ పోస్తాడు. ఆ తర్వాత కరిగించిన ఐస్‌క్రీమ్‌ను డిష్‌పై పోసి కొంత సమయం తర్వాత అన్నింటినీ కలిపి రోల్ ఆకారంలో తయారు చేశాడు.. అతను రోల్స్‌పై చిక్‌పీస్, ఉల్లిపాయలు, ఊరగాయలతో డిష్‌ను అందిస్తాడు.  Cravings (@cravingseverytime) అనే ఖాతా ద్వారా ఈ వీడియో Instagramలో షేర్‌ చేయబడింది. ఈ వంటకాన్ని చూసిన తర్వాత.. మీరు చోలే భాతురే తినడమే మర్చిపోతారంతే..

ఇవి కూడా చదవండి

చోలే భాతురే ఐస్ క్రీం వీడియో పాతదని తెలిసింది. కానీ, ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 2.5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే చాలా మంది వినియోగదారులు చాలా ఫన్నీ కామెంట్స్ చేశారు. కొంతమంది వినియోగదారులు ఈ వంటకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూసి ఇదేం ప్రయోగంరా బాబు అంటూ మరికొందరు నెటిజన్లు తలబాదుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..