58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రి కాబోతున్న బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. అతని మూడో భార్యే స్వయంగా..

మరికొన్ని వారాల్లో తమ కుటుంబంలోకి కొత్త అతిథి వస్తున్నాడంటూ.. క్యారీ తన ఇద్దరు పిల్లలు చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. ఏప్రిల్‌ 2020లో విల్ఫ్ జన్మించగా.. డిసెంబర్‌ 2021లో రోమీ పుట్టాడు.. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. బోరిస్‌కు ఇది మూడో వివాహం.

58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రి కాబోతున్న బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. అతని మూడో భార్యే స్వయంగా..
Boris Johnson
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2023 | 1:34 PM

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎనిమిదో బిడ్డకు తండ్రి కాబోతున్నారున. ఈ విషయాన్ని బోరిస్ జాన్సన్ భార్య క్యారీ జాన్సన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. క్యారీ తను గర్భవతిననే విషయం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. మరికొన్ని వారాల్లో తమ కుటుంబంలోకి కొత్త అతిథి వస్తున్నాడంటూ.. క్యారీ తన ఇద్దరు పిల్లలు చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్‌ కొన్నేళ్లు సహజీనం చేశాడు. అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్‌ 2020లో విల్ఫ్ జన్మించగా.. డిసెంబర్‌ 2021లో రోమీ పుట్టాడు.. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. బోరిస్‌కు ఇది మూడో వివాహం.

బోరిస్ జాన్సన్‌కు మాజీ భార్య మెరీనా వీలర్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు. అతనికి మాజీ ప్రియురాలు హెలెన్ మసింతీర్‌తో ఒక బిడ్డ కూడా ఉంది. ఓవెన్‌కు అతని మొదటి భార్య అల్లెగ్రా మోస్టిన్ ద్వారా పిల్లలు లేరు. బోరిస్ జాన్సన్ తన కొత్త అతిథిని స్వాగతించడానికి £3.8 మిలియన్ తొమ్మిది పడకగదుల భవనాన్ని కొనుగోలు చేసినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

బోరిస్‌ జాన్సన్‌ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్‌ ఓవెను వివాహం చేసుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అప్పుడు వీరికి ఎలాంటి సంతానం కలగలేదు. ఆ తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్‌ ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్-వీలర్‌ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!