AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jetstar: లగేజీ ఛార్జ్ తప్పించుకునేందుకు యువతి వింత ఆలోచన.. ఒంటినిండా బట్టలు వేసుకున్నందుకు జరిమానా..

విమాన ప్రయాణాల్లో లగేజీకి పరిమితి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌ చెక్‌చేసి మరీ పంపిస్తుంటారు. పొరపాటున ప్రయాణికులు తీసుకెళ్లే లగేజ్‌ పరిమితికి మించినా, అభ్యంరతకరమైన వస్తువులు తీసుకెళ్లినా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అనుమతించరు. కాదని మోసం చేసి తీసుకెళ్లాలని ప్రయత్నించి, పట్టుబడితే ఫైన్‌ కట్టక తప్పదు. తాజాగా ఓ మహిళకు అలాంటి సంఘటనేఎదురైంది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆడ్రియానా అనే యువతి తన స్నేహితురాలితో కలిసి టూర్ కి వెళ్లింది. టూర్ పూర్తయ్యాక […]

Jetstar: లగేజీ ఛార్జ్ తప్పించుకునేందుకు యువతి వింత ఆలోచన.. ఒంటినిండా బట్టలు వేసుకున్నందుకు జరిమానా..
Woman In Australia
Surya Kala
|

Updated on: May 20, 2023 | 1:56 PM

Share

విమాన ప్రయాణాల్లో లగేజీకి పరిమితి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌ చెక్‌చేసి మరీ పంపిస్తుంటారు. పొరపాటున ప్రయాణికులు తీసుకెళ్లే లగేజ్‌ పరిమితికి మించినా, అభ్యంరతకరమైన వస్తువులు తీసుకెళ్లినా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అనుమతించరు. కాదని మోసం చేసి తీసుకెళ్లాలని ప్రయత్నించి, పట్టుబడితే ఫైన్‌ కట్టక తప్పదు. తాజాగా ఓ మహిళకు అలాంటి సంఘటనేఎదురైంది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఆడ్రియానా అనే యువతి తన స్నేహితురాలితో కలిసి టూర్ కి వెళ్లింది. టూర్ పూర్తయ్యాక అడిలైడ్‌లోని తన ఇంటికి బయలుదేరింది. అయితే, విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో తన లగేజీ బరువు ఎక్కువగా ఉన్నట్టు ఆమె గుర్తించింది. దీంతో, లగేజీలో ఎక్కువగా ఉన్న బట్టలను తనే వేసుకుంటే అదనపు చార్జీలు తగ్గుతాయని భావించింది. దాంతో ఆమె మొత్తం అయిదున్నర కేజీల బరువున్న బట్టలను ఒకదానిపై ఒంటిపై ధరించింది. ఫలితంగా, ఆమె చూసేందుకు ఓ భారీ శరీరం ఉన్న మనిషిలా మారింది. ఇదంతా ఆ యువతి స్వయంగా ఓ టిక్‌టాక్ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఇంత చేసినా కూడా లగేజీ బరువు కిలో ఎక్కువగా ఉండటంతో చివరకు జరిమానా చెల్లించాల్సి వచ్చిందట. తనకు ఎదురైన పరిస్థితి గురించి టిక్‌టాక్ వీడియోలో వివరించిన యువతి, తనలాగా మరెవ్వరూ ప్రయత్నించకూడదని సలహా ఇచ్చింది. ఇలా అన్ని దుస్తులు ధరించి విమానంలో ప్రయాణించడం తనకే కాకుండా తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకొచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..