Ice Cream: అత్యంత ఖరీదైన ఐస్‌క్రీంను ఎప్పుడైన చూశారా.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జపాన్‌కు చెందిన సెలాటో అనే ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ ఓ ప్రత్యేకమైన హిమక్రీమును తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి ఈ ఐస్‌క్రీమ్‌ను తయారుచేశారు. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా రికార్డు సాధించింది.
జపాన్‌కు చెందిన సెలాటో అనే ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ ఓ ప్రత్యేకమైన హిమక్రీమును తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి ఈ ఐస్‌క్రీమ్‌ను తయారుచేశారు. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా రికార్డు సాధించింది. ఈ కంపెనీ ఆ ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్ యెన్ (భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షలు)ల చొప్పున విక్రయిస్తోంది.
ఈ ఐస్‌క్రీం తయారీలో ఉపయోగించిన వైట్ ట్రఫుల్ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించారు. ఈ ట్రిఫుల్ ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్‌లు ఉంటుంది. ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ ఐస్‌క్రీమ్ ధర ఇంత భారీగా పెంచేశారు నిర్వాహకులు. దీంతో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్, సేక్ లీస్ అనే వైట్ సాస్ వంటి పదార్థాలు కూడా ఈ ఐస్‌క్రీంలో వాడారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్ రికార్డు దక్కించుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..