Medico Preethi: మెడికో ప్రీతి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి ఎర్రబెల్లి

మెడికో ప్రీతి చెల్లి పూజకు హెచ్‌ఎండీఏలో ఉద్యోగం ఇస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా నియమించినట్లు హెచ్ఎండీఏ పేర్కొంది.

Medico Preethi: మెడికో ప్రీతి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి ఎర్రబెల్లి
Medico Preethi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2023 | 10:13 PM

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మెడికో విద్యార్థిని ప్రీతి చెల్లెలు పూజకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సీఏం కేసీఆర్ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మెడికో ప్రీతి చెల్లి పూజకు హెచ్‌ఎండీఏలో ఉద్యోగం ఇస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ సెల్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా నియమించినట్లు హెచ్ఎండీఏ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని తెలిపారు.

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న.. పాయిజన్ ఇంజెక్షన్‌ తీసుకుని బలవన్మరణానికి యత్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించారు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రభుత్వం, ప్రీతి కుటుంబానికి మధ్య వారధిగా నిలిచారు. పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ఆమె చెల్లెలు పూజకు ఉద్యోగం ఇప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..