Andhra Pradesh: నెల్లూరులో హాజీపై ఎటాక్.. బాబాయ్, అబ్బాయ్ మధ్య పీక్స్‌కు చేరిన వివాదం..
నెల్లూరు వైసీపీలో అబ్బాయ్-బాబాయ్ ఫైట్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. మొన్నటివరకు డైలాగ్స్, కేసులు, స్ట్రీట్ ఫైట్స్ వరకే పరిమితమైన గొడవలు.. ఇప్పుడు ఏకంగా ఎటాక్స్ వరకూ వచ్చాయ్. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ అనుచరుడు హాజీ..

నెల్లూరు వైసీపీలో అబ్బాయ్-బాబాయ్ ఫైట్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. మొన్నటివరకు డైలాగ్స్, కేసులు, స్ట్రీట్ ఫైట్స్ వరకే పరిమితమైన గొడవలు.. ఇప్పుడు ఏకంగా ఎటాక్స్ వరకూ వచ్చాయ్. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ అనుచరుడు హాజీపై హత్యాయత్నం జరిగింది. కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో హాజీకి తీవ్ర గాయాలయ్యాయ్. ఈ ఇన్సిడెంట్ నెల్లూరు వైసీపీలోనే కాదు, నగరంలోనూ కలకలం రేపింది. ఉద్రిక్తతతోపాటు లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఏర్పడింది.
మాజీ మంత్రి అనిల్‌యాదవే.. ఈ దాడి చేయించారనేది రూప్‌కుమార్ వర్గం ఆరోపణ. ఆస్పత్రిలో హాజీని పరామర్శించిన డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్.. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ టార్గెట్‌గా హాట్ కామెంట్స్ చేశారు. మమ్మల్ని టచ్ చేయొద్దంటూ స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ జోలికొస్తే.. తాము చేసే రివర్స్ ఎటాక్‌ను తట్టుకోలేరంటూ హెచ్చరించారు రూప్‌కుమార్.
బాబాయ్ రూప్‌కుమార్ కామెంట్స్‌కి అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు అబ్బాయ్ అనిల్‌కుమార్. మిమ్మల్ని ఎవడు కొట్టినా.. అది నా పనేనా అంటూ నిప్పులు చెరిగారు. తప్పుడు ఆరోపణలు చేస్తే బట్టలూడదీసి నిలువునా చీరేస్తా అంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు అనిల్. అసలు, రూప్‌కుమార్ ఏమన్నారు. అనిల్‌కుమార్ కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..