ACB Raids: డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా బయటపడిన ఆస్తి పత్రాలు, బంగారం..

ACB Raids in Anakapalle: ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై ఏపీ డీజీపీ కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అధికారి పైన ACB అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా..

ACB Raids: డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా బయటపడిన ఆస్తి పత్రాలు, బంగారం..
Acb Raids In Anakapalle
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 20, 2023 | 7:53 PM

ACB Raids in Anakapalle: ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై ఏపీ డీజీపీ కె.వి.రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అధికారి పైన ACB అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కోట్ల సన్ని రాంబాబు అక్రమార్జనపై ACB అధికారులు సోదాలు చేశారు. సదరు రాంబాబు అక్రమార్జన, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అందిన సమాచారం మేరకు ఏసిబి అధికారులు అతని ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.

ఏసీబీ సోదాలలో గుర్తించిన ఆస్తుల వివరాలు:

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ రాంబాబు ఆస్తులు, అక్రమార్జనపై చేసన సోదాలలో అనేక చోట్ల అతనికి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల సన్ని రాంబాబుకు గాజువాకలో 11 ఫ్లాట్ లతో కూడిన అపార్ట్మెంట్, గాజువాక లో G+3 బిల్డింగ్, శివాజీ పాలెం లో ఫ్లాట్, మల్కాపురం లో G+3 బిల్డింగ్, మల్కాపురం లో G+2 బిల్డింగ్, భోగాపురంలో 11 సెంట్ల భూమి, స్కొడా కార్, సుమారు 927.08 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు 2156 గ్రాముల వెండి వస్తువులు ఉన్నట్లు తెలిసింది. ఇంకా అతని ఇంట్లో రూ. 2,51,130 నగదు కూడా అధికారులకు లభించింది. ఇక రాంబాబు ఇంట్లో వెస్పా స్కూటీ, పల్సర్ బైక్ కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఇంకా రాంబాబు ఇంట్లో వివిధ బ్యాంక్ పాస్ బుక్‌లను కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. అయితే వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఇక ఆయా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించవచ్చని DGP రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..