Andhra Pradesh: ఒంగోలు రాధ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కారుతో కసితీరా చంపింది అతనే..!
ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వివాహిత రాధ మర్డర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయ్. రాధను చంపింది ఆమె స్నేహితుడు కాశిరెడ్డి కాదని తేలింది.
ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వివాహిత రాధ మర్డర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయ్. రాధను చంపింది ఆమె స్నేహితుడు కాశిరెడ్డి కాదని తేలింది. భర్త మోహన్‌రెడ్డే.. రాధను అత్యంత కిరాతంగా చంపినట్టు ప్రాథమికంగా తేల్చారు పోలీసులు.
రాధ మర్డర్‌కు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. అయితే, రాధను అత్యంత ఘోరంగా చంపినట్టు గుర్తించారు పోలీసులు. రాధను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లి హింసించినట్టు తేల్చారు. ప్రాణం ఉండగానే కారుతో ఇష్టానుసారంగా తొక్కించి చంపినట్టు ఆనవాళ్లు దొరికాయ్.
భర్తే చంపాడన్న నిజాన్ని జీర్జించుకోలేకపోతున్నారు రాధ తల్లిదండ్రులు. మోహన్‌రెడ్డితోపాటు నిందితులందర్నీ ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. రాధను చంపింది భర్తేనని ప్రాథమికంగా తేలిందన్నారు కనిగిరి డీఎస్పీ రామరాజు. అయితే, కారణాలేంటనేది కనిపెట్టాల్సి ఉందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..