AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలకునే భక్తులకు కీలక అప్‌డేట్. సామాన్య భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తు సౌలభ్యం కోసం ఆర్జిత సేవలు, విఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది.

TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు..
Tirumala Temple
Shiva Prajapati
|

Updated on: May 20, 2023 | 7:24 PM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలకునే భక్తులకు కీలక అప్‌డేట్. సామాన్య భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తు సౌలభ్యం కోసం ఆర్జిత సేవలు, విఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరిట ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన సారాంశం ఇలా ఉంది.

‘కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది.’ అని ప్రకటనలో తెలిపారు.

శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 20 నిమిషాలు సమయం అవుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది టీటీడీ. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవునుంది. టీటీడీ జారీ చేసిన ఈ ప్రకటనను, సమయ వేళలలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తిరుమల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..