AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Lose Tips: శరీర బరువు తగ్గించుకునేందుకు 5 సూత్రలు.. ఈ సమ్మర్‌లోనే పాటించారంటే నాజూకైన నడుము ఖాయం..

Weight Lose: అధిక బరువు, ఒబెసిటీ అనేవి మనలో చాలా మందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు. ఇవి మనల్ని తొందరగా అలసిపోయేలా చేయడమే కాక మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదిగా కూడా ఉంటుంది. ఇక బరువు తగ్గేందుకు కొందరు నానా పాట్లు పడుతుంటారు, ఏవేవో ట్రీట్‌మెంట్స్, వర్కౌట్స్..

Weight Lose Tips: శరీర బరువు తగ్గించుకునేందుకు 5 సూత్రలు.. ఈ సమ్మర్‌లోనే పాటించారంటే నాజూకైన నడుము ఖాయం..
Weight Lose Tips In Summer
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 20, 2023 | 4:30 PM

Share

Weight Lose: అధిక బరువు, ఒబెసిటీ అనేవి మనలో చాలా మందిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇవి మనల్ని తొందరగా అలసిపోయేలా చేయడమే కాక మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదిగా కూడా ఉంటుంది. ఇక బరువు తగ్గేందుకు కొందరు నానా పాట్లు పడుతుంటారు, ఏవేవో ట్రీట్‌మెంట్స్, వర్కౌట్స్ చేస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బరువు తగ్గాలనే ఆలోచనను వదిలి, సర్దుకుంటూ పోతారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు వర్కౌట్స్ చేయడం మంచిది. కానీ వ్యాయామంతో పాటు పోషకాలతో కూడిన ఆహారం కూడా తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో పోషకాహారాలను తినడం ద్వారా వాటిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు బరువును తగ్గించడమే కాక శరీరంలోని కొవ్వును కూడా కరిగించేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేయాలని అంటున్నారు. మరి ఇలా బరువు తగ్గేందుకు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

హైడ్రేటెడ్ ఫుడ్స్: బరువు తగ్గాలనుకునేవారు ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్‌గా ఉండాలని, అందుకోసం నీటిని ఎక్కువగా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇంకా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తాజా పండ్లు, దుంపలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు: తాజా పండ్లు, కూరగాయలతో తక్కువ కేలరీలు , అలాగే ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ కారణంగానే ఇవి బరువు తగ్గడానికి గొప్ప ఎంపిక అంట. అందుకోసం రోజులో కనీసం 5 సార్లు పండ్లు, కూరగాయలను తీసుకోండి.

ఇవి కూడా చదవండి

నో ప్రాసెస్డ్ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలలో కేలరీలు, చక్కెర, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ ఆకలిని తాత్కాలికంగా తీర్చినా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఇంకా ఇందులోకి చెడు కొవ్వు మీ బరువును పెంచడమే కాక హృదయ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

వ్యాయామం: వేసవిలోని వెచ్చని వాతావరణం బయటికి రావడానికి, చురుకుగా ఉండటానికి అనకూలంగా ఉంటుంది. ఈ వాతావరణంలో మీరు ఎనర్జిటిక్‌గా వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి చేయవచ్చు. జిమ్ వర్కౌట్స్ కంటే యోగా ఆసనాలతో మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రశాంతమైన నిద్ర: శరీరానికి శక్తి కోసం ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఇక ప్రశాంతంగా నిద్ర పోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. అవును, బరువు తగ్గడానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రశాంతమైన నిద్ర కారణంగా మీ హార్మోన్లను నియంత్రించడంలో, జీవక్రియ, జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ పెరగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు తొలగిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..