Vijayawada: మరీ ఇంత దారుణమా..? స్విమ్మింగ్‌ పూల్‌లో దిగారని పిల్లల్ని కట్టేసిన సిబ్బంది..

Vijayawada: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. రామవరప్పాడులోని ఎస్ఎల్‌వీ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన బాలుడిని గేటుకు కట్టేశారు సిబ్బంది. గురువారం మిత్రుడి యశ్వంత్‌తో కలిసి SLV గేటెడ్ కమ్యూనిటీకి పాలు పోయటానికి వెళ్లాడు మణికంఠ. అక్కడే ఉన్న స్విమ్మింగ్..

Vijayawada: మరీ ఇంత దారుణమా..? స్విమ్మింగ్‌ పూల్‌లో దిగారని పిల్లల్ని కట్టేసిన సిబ్బంది..
Parents Complaints On Slv Management
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 19, 2023 | 5:35 AM

Vijayawada: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. రామవరప్పాడులోని ఎస్ఎల్‌వీ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన బాలుడిని గేటుకు కట్టేశారు సిబ్బంది. గురువారం మిత్రుడి యశ్వంత్‌తో కలిసి SLV గేటెడ్ కమ్యూనిటీకి పాలు పోయటానికి వెళ్లాడు మణికంఠ. అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాడు. ఇది గుర్తించిన వాచ్ మెన్లు మణికంఠను ఎంట్రన్స్ గేటుకి కట్టేసి కొట్టారు. ఆపై ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాలంటూ యశ్వంత్‌ని పంపారు సిబ్బంది.

అయితే ఘటన గురించి భయాందోళనకు గురైన యశ్వంత్ ఇంటికి వెళ్లి విషయం చెప్పలేదు. రాత్రికి మణికంఠ ఇంటికి రాకపోవటంతో విషయం తెలిసి ఘటన జరిగిన చోటుకు వచ్చారు తల్లిదండ్రులు. అక్కడ బాలుడు లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమ విచారణలో పిల్లవాడి గురించి తెలుసుకున్నారు. అనంతరం గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..