- Telugu News Photo Gallery Nepal Tourist Places: these places of Nepal are best for summer vacation trip, you must visit if planning for a foreign tour
Nepal Tour: హాలీడే టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ‘హిమాలయ దేశం’లోని ఈ ప్రదేశాలకు వెళ్లండి.. మైమరపించే అందాలను చూడోచ్చు..
నేపాల్ పర్యాటక ప్రదేశాలు: మీరు వేసవి సెలవుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే, నేపాల్‌ను కూడా మీ జాబితాలో చేర్చుకోవచ్చు. హిమాలయాలలో ఉన్న నేపాల్ దాని సంస్కృతి, పర్యాటక ప్రదేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి.
Updated on: May 19, 2023 | 6:25 AM

నేపాల్ చాలా అందమైన దేశం. వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం ఈ సెలవులకు విదేశాలకు వెళ్లాలనుకుంటే, నేపాల్‌కు నిశ్చయంగా వెళ్లవచ్చు. అలా మీరు వెళ్లాలనుకుంటే నేపాల్‌లోని ఈ ప్రదేశాలను కూడా సందర్శించండి.. వీటిని సందర్శించకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తే, మీ ప్రయాణం అసంపూర్ణం.

పోఖారా: మీరు నేపాల్‌కు వెళ్లి పోఖారాను సందర్శించకపోతే, మీ ప్రయాణం వ్యర్థమయినట్లే. నిజంగా, ఇక్కడ ప్రశాంతమైన సరస్సుల ఉత్కంఠభరితమైన సీనరీస్ మీకు ప్రశాంతత, శాంతిని అందించేందుకు పని చేస్తాయి. పోఖారా సహజ సౌందర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, బోటింగ్ వంటివాటిని కూడా ఆనందించవచ్చు.

లుంబిని: లుంబిని బుద్ధ భగవానుడి జన్మస్థలంగా ప్రసిద్ధి. ఈ ప్రదేశం మతపరమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్న కారణంగా ఇది చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ మీకు అశోక స్తంభం, మాయా దేవి ఆలయం, అనేక బౌద్ధ మఠాలు ఇక్కడ కనిపిస్తాయి.

ఖాట్మండు: ఖాట్మండు నేపాల్ రాజధాని. ఇదొక చారిత్రక నగరం. ఈ నగరంలో మీరు సందర్శించడానికి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా పశుపతినాథ్ ఆలయం, బౌధంత్ స్థూపం ప్రధానమైనవి. ఇంకా ఖాట్మండులోని సందడిసందడిగా ఉండే మార్కెట్లలో షాపింగ్, రుచికరమైన ఆహారాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు.

నాగర్‌కోట్: నాగర్‌కోట్ ప్రకృతి అందాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి మీరు సూర్యాస్తమయం, సూర్యోదయానికి సంబంధించిన అందమైన దృశ్యాలను చూడవచ్చు. ఇంకా మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇష్టమైతే, ఇది మీరు తప్పక సందర్శించవలసిన ప్రదేశం అనడంలో అతిశయోక్తి లేదు. మీరు ఇక్కడ పారాగ్లైడింగ్, హైకింగ్, మౌంటెన్ బైకింగ్‌ని ఆనందించవచ్చు.





























