AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BRS Office: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?

బీఆర్ఎస్‌ని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీపై కూడా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తోట చంద్రశేఖర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించిన గులాబీ బాస్‌.. కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఏపీలో బీఆర్‌ఎస్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైన నేపథ్యంలో.. గుంటూరులో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే […]

AP BRS Office: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?
AP BRS Office
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 19, 2023 | 5:30 AM

Share

బీఆర్ఎస్‌ని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీపై కూడా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తోట చంద్రశేఖర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించిన గులాబీ బాస్‌.. కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఏపీలో బీఆర్‌ఎస్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైన నేపథ్యంలో.. గుంటూరులో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనునన్నారు.  ఈ మేరకు గుంటూర్‌ ఆటోనగర్‌లో ఐదు అంతస్థుల భవనంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదట అంతస్థులో కార్యకర్తలతో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు మూడు అంతస్థుల్లో పరిపాలన విభాగాలను సిద్దం చేశారు.

అలాగే ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయాన్ని తీర్చి దిద్దారు. మూడు విభాగాలు అధ్యక్షుడుడి కార్యాలయాన్ని విభజించారు. అతిధులు కూర్చోనే విధంగా పెద్ద హాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముఖ్య నేతలతో సమావేశం అయ్యేందుకు హాలు ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడి గదిని తీర్చి దిద్దారు. గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ఆదివారం 11.35 నిమిషాలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు సిద్దం అయ్యేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నెక్ట్స్ వీక్ నుంచి పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలి వంటి ప్రణాళికలు ఇక్కడి నుంచే జరగనున్నాయి.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తోట కోరారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ నెక్ట్స్‌ మధ్యప్రదేశ్‌లో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో దూకుడుగా పార్టీ కార్యాలయం సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us