Andhra Pradesh: చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. స్నేహితుడిని కాపాడబోయి మునిగిపోయిన నిఖిల్..
Vishakhapatnam: విశాఖ పెందుర్తిలోని నరవలో విషాదం చోటు చేసుకుంది. నవర క్వారీలో గ్రావెల్ కోసం తవ్విన గుంతలో చేరిన నీటిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతయారు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజేష్, నిఖిల్. పరీక్షలు పూర్తవడంతో..
Vishakhapatnam: విశాఖ పెందుర్తిలోని నరవలో విషాదం చోటు చేసుకుంది. నవర క్వారీలో గ్రావెల్ కోసం తవ్విన గుంతలో చేరిన నీటిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతయారు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజేష్, నిఖిల్. పరీక్షలు పూర్తవడంతో.. సరదాగా జలకాలాడేందుకు విద్యార్థులంతా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మిగతావాళ్లు బయలుదేరకముందే.. ఇద్దరూ క్వారీ చెరువు దగ్గరకు వెళ్లిపోయారు.
ముందుగా రాజేష్ ఆ నీటిలో గల్లంతవుతుండగా.. రక్షించే ప్రయత్నం చేశాడు నిఖిల్. తన తోటి సహచర్లకు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చేలోగానే నిఖిల్ కూడా కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిఖిల్, రాజేష్ గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.
కాగా, 2012 నుంచి 2022 వరకు విశాఖపట్నం, చుట్టుపక్కల వివిధ బీచ్‌లలో 200 మందికి పైగా సముద్రంలో మునిగిపోయారని లెక్కలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం నగరంలోని RK బీచ్‌లోనే 60 శాతం మరణాలు సంభవించాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..