AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జిల్లా జడ్జి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..ఎంపికైతే నెలకు రూ.1,94,660ల వరకు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో.. 10 డిస్ట్రిక్ట్‌ జడ్జి (ఎంట్రీ లెవెల్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు విద్యార్హతలతోపాటు..

AP High Court Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జిల్లా జడ్జి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..ఎంపికైతే నెలకు రూ.1,94,660ల వరకు
AP High Court
Srilakshmi C
|

Updated on: May 18, 2023 | 9:54 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో.. 10 డిస్ట్రిక్ట్‌ జడ్జి (ఎంట్రీ లెవెల్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు విద్యార్హతలతోపాటు నిర్దేశిత న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో మే 25, 2023వ తేదీలోపు కింది అడ్రస్కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ కేటగిరి అభ్యర్ధులు రూ.800ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,44,840ల నుంచి రూ.1,94,660ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం.. రాత పరీక్ష మూడు పేపర్లకు ఉంటుంది. పేపర్-1లో కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ సివిల్‌ లా, పేపర్-2లో క్రిమినల్ లా, పేపర్ 3లో ఇంగ్లిష్ (ట్రాన్స్‌లేషన్‌, ఎస్సే రైటింగ్‌) ఉంటుంది. వైవా టెస్ట్‌ 50 మార్కులకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అడ్రస్..

The Chief Secretary ti Government, Government of Andhra Pradesh, General Administratuion (SC.F) Department, Secretariat Buildings, Velagapudi, Amaravathi, Guntur District, Andhra Pradesh – 522238.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.