Realme Mobiles: రూ.11 వేలకే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అద్దిరిపోయే డిజైన్, ఫీచర్స్, 50MP కెమెరా.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

Realme Narzo N53: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్ మొబైల్‌ను విడుదల అయింది. Realme Narzo N53 అనే ఈ స్మార్ట్‌ఫోన్‌ నార్జో ఎన్ సిరీస్‌లో వచ్చిన రెండో ఫోన్ కావడం దీని విశేషం. గత నెలలోనే రియల్‌మీ కంపెనీ ఈ ఫోన్‌ను..

Realme Mobiles: రూ.11 వేలకే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అద్దిరిపోయే డిజైన్, ఫీచర్స్, 50MP కెమెరా.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?
Realme Narzo N53
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 19, 2023 | 6:00 AM

Realme Narzo N53: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో కొత్త మోడల్ మొబైల్‌ను విడుదల అయింది. Realme Narzo N53 అనే ఈ స్మార్ట్‌ఫోన్‌ నార్జో ఎన్ సిరీస్‌లో వచ్చిన రెండో ఫోన్ కావడం దీని విశేషం. గత నెలలోనే రియల్‌మీ కంపెనీ ఈ ఫోన్‌ను ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇక ఈ ఫోన్ మే 24 నుంచి అందుబాటులోకి రానుంది.

Realme Narzo N53 ధర:

Realme Narzo N53 ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభించనుంది. 4జీబీ+ 64 జీబీ వేరియంట్ ధర రూ. 8,999 గా, అలాగే 6జీబీ+ 128 జీబీ వేరియంట్ ధరను రూ. 10,999 రియల్‌బీ కంపెని నిర్ణయించింది. ఈ ఫోన్ అమ్మకాలు మే 24 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ ఫోన్ పై కొన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో 1000 రూపాయల వరకు డిస్కౌంట్.. అలాగే ఫస్ట్ సేల్‌లో భాగంగా 4 జీబీ వేరియంట్‌ను రూ. 500, 6జీబీ వేరియంట్‌ను రూ. 1000 డిస్కౌంట్‌పై విక్రయిస్తుంది రియల్‌మీ. అయితే మే 22 మధ్యాహ్నం 2 -4 గంటల మధ్య రూ. 1000 ల వరకు డిస్కౌంట్‌తో స్పెషల్ సేల్ నిర్వహించనున్నట్టు రియల్‌మీ  ప్రకటించింది.

Realme Narzo N53 ఫీచర్స్

Realme Narzo N53 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 90HZ రిఫ్రెష్ రేటు కలిగిన 6.74 అంగుళాల డిస్‌ప్లే వస్తోంది. ఇంకా  ఇందులో అక్టాకోర్ యునిసోక్ టీ612 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13 సప్పోర్ట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇంకా ఇందులో 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. బ్లాక్ , గోల్డ్ కలర్‌లలో మాత్రమే లభించే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..