Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final, IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రికీ పాంటింగ్‌ జోస్యం.. ఏ టీమ్ గెలుస్తుందో తేల్చేసిన ఆసీస్ మాజీ కెప్టెన్..

India vs Australia: అటు క్రికెట్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ జరగడానికి ఇంకా 20 రోజులు కూడా లేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు..

WTC Final, IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రికీ పాంటింగ్‌ జోస్యం.. ఏ టీమ్ గెలుస్తుందో తేల్చేసిన ఆసీస్ మాజీ కెప్టెన్..
Rikcy Ponting On Wtc Final
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 20, 2023 | 3:43 PM

WTC Final, IND vs AUS: అటు క్రికెట్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ జరగడానికి ఇంకా 20 రోజులు కూడా లేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు పోటిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా ఈ లిస్టులోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కూడా చేరాడు.

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. భారత్‌ కంటే ఆస్ట్రేలియాకే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. లండన్‌ ఓవల్‌ మైదానంలోని పరిస్థితులు ఆస్ట్రేలియా తరహాలోనే ఉంటాయని, అవి కంగారులకు ఎంతగానో సానుకూలంగాఉంటాయని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ఇంకా ‘ఓవల్‌ పిచ్‌ ఆస్ట్రేలియా వికెట్‌‌లానే ఉంటుంది. ఈ కారణంగానే ఆసీస్‌కు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే మ్యాచ్‌ భారత్‌లోని మైదానాలలో జరిగితే నిస్సందేహంగా టీమిండియా గెలిచి తీరుతుంది. అక్కడ ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం’ అని తెలిపాడు.

కాగా, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవెల్ మైదానంలో జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు కూడా పట్టుదల మీదున్నాయి. మరోవైపు టీమిండియాకు ఇది రెండో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్. అంతకముందు 2019-2021 ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించి, విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..