DC vs CSK Playing 11: టాస్ గెలిచిన చెన్నై.. కీలక మార్పులతో బరిలోకి.. ప్లేఆఫ్స్ చేరేనా?
Delhi Capitals vs Chennai Super Kings Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ సీజన్‌లో చివరి డబుల్ హెడర్ మ్యాచ్ మొదలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ ముందుగా బౌలింగ్ చేయనుంది.

ఈరోజు చెన్నై గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అలాగే ఢిల్లీపై వరుసగా నాలుగో విజయం అవుతుంది. ఢిల్లీ చివరిసారిగా 2021లో చెన్నైపై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. చివరి మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది.
పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఢిల్లీ..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 జట్లతో కూడిన పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుతం జట్టుకు 10 పాయింట్లు ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై 7 మ్యాచ్‌లు గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చెన్నైలో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం ఆ జట్టు 15 పాయింట్లతో ఉంది.
ఇరుజట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..