IPL 2023: 50, 500, 1000.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు.. ఆ విషయంలో నంబర్ వన్‌గా శుభ్మన్ గిల్..

Shubman Gill Fifty: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న ఐపీఎల్ 2023లో భాగంగా 62వ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతాలు చేశాడు. హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ గిల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ సీజన్‌లో అతనికిది 5వ హాఫ్ సెంచరీ.

IPL 2023: 50, 500, 1000.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు.. ఆ విషయంలో నంబర్ వన్‌గా శుభ్మన్ గిల్..
Shubman Gill Fifty Ipl 2023
Follow us
Venkata Chari

|

Updated on: May 15, 2023 | 9:00 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న ఐపీఎల్ 2023లో భాగంగా 62వ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతాలు చేశాడు. హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ గిల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ సీజన్‌లో అతనికిది 5వ హాఫ్ సెంచరీ. 8వ ఓవర్‌లో మయాంక్ మార్కండే వేసిన తొలి బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఫోర్ బాదిన గిల్ 50 పరుగులను పూర్తి చేశాడు.

తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయినా.. ఫోర్ల వర్షం కురిపిస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 4వ ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

అంతేకాదు దీనితో గిల్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ తరపున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 500కు పైగా పరుగులు కూడా చేశాడు.