AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ‘ ఆయనది WTC ఫైనల్‌ ఆడాల్సిన ఫేస్ కాదు.. అంతకు మించిన తోపులు టీమిండియా ఉన్నారు’

Shardul Thakur: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్కాట్ స్టైరిస్ టీమ్ ఇండియా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఠాకూర్‌ను ఆల్‌రౌండర్‌గా అంగీకరించేందుకు స్టైరిస్ నిరాకరించాడు.

IPL 2023: ' ఆయనది WTC ఫైనల్‌ ఆడాల్సిన ఫేస్ కాదు.. అంతకు మించిన తోపులు టీమిండియా ఉన్నారు'
Wtc Final Ind Vs Aus
Venkata Chari
|

Updated on: May 17, 2023 | 3:41 PM

Share

న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్కాట్ స్టైరిస్ టీమ్ ఇండియా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఠాకూర్‌ను ఆల్‌రౌండర్‌గా అంగీకరించేందుకు స్టైరిస్ నిరాకరించాడు. ఠాకూర్ తన బ్యాట్‌తో తన జట్లను చాలాసార్లు గెలిపించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో కూడా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించఆడు. భారత్ తరపున ఠాకూర్ కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు.

ఠాకూర్ సాధారణంగా భారత జట్టులో టెస్టుల్లో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంటాడు. అయితే ఠాకూర్ కంటే పాండ్యా చాలా బెటర్ అని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. దీనికి కారణాన్ని స్టైరిస్ వివరిస్తూ, పాండ్యా సరైన ఆల్ రౌండర్ అని నమ్ముతున్నాను. అయితే ఠాకూర్ కాదంటూ ప్రకటించాడు. ఠాకూర్ IPL-2023లో ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడాడు. 110 పరుగులు చేసి ఐదు వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఠాకూర్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియాలో ఎంపికైన సంగతి తెలిసిందే.

జట్టులోకి రావాలంటే పోరాడాలి..

టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఠాకూర్ పాండ్యాతో పోరాడాల్సి ఉంటుందని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ.. ఠాకూర్‌కు బౌండరీలు కొట్టే సామర్థ్యం ఉందని స్టైరిస్ అంగీకరించాడు. ఠాకూర్‌ టెస్టుల్లో భారత్‌ తరపున కొన్ని మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడని, ప్రతిభ ఉందని, అయితే పాండ్యా ఎదుగుదల ఠాకూర్‌కు ఇబ్బంది కలిగించిందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

పాండ్యా సరైన ఆల్ రౌండర్ అని చెప్పిన స్టైరిస్.. జట్టులో ఒకే తరహా ఆటగాళ్లు ఇద్దరు ఉంటారా అని ప్రశ్నించాడు. పాండ్యా కంటే ఠాకూర్ గొప్పవాడు కాదంటూ షాక్ ఇచ్చాడు. ఠాకూర్‌ను ఆల్‌రౌండర్‌గా పరిగణించేందుకు అతను సున్నితంగా నిరాకరించాడు. ఠాకూర్ బ్యాకప్‌గా ఆడగలడని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు.

టెస్టు జట్టుకు దూరమైన పాండ్యా..

2022కి ముందు దాదాపు రెండేళ్లపాటు పాండ్యా గాయాలతో ఇబ్బంది పడ్డాడు. ఫామ్ కూడా సరిగ్గా లేదు. బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో పాండ్యా ప్రత్యామ్నాయం కోసం టీమిండియా అన్వేషణ ప్రారంభించింది. వెంకటేష్ అయ్యర్, ఠాకూర్, దీపక్ చాహర్ అతనికి ప్రత్యామ్నాయంగా కనిపించారు. కానీ, 2022 IPL నుంచి పాండ్యా పునరాగమనం అతన్ని టీమ్ ఇండియా రేసులో ముందు ఉంచింది.

టీ20లో జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో గుజరాత్ గత ఏడాది ఐపీఎల్‌ను అరంగేట్రం సీజన్‌లోనే గెలుచుకుంది . ఈ సమయంలో పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ చాలా ప్రమాదకరంగా ఉన్నా.. టెస్టు జట్టులోకి ఇంకా పునరాగమనం చేయలేకపోయినప్పటికీ.. త్వరలోనే టెస్టు జట్టులో కనిపించవచ్చని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..