Shubman Gill: 13 ఫోర్లు, 1 సిక్స్.. 174 స్ట్రైక్‌రేట్‌తో హైదరాబాద్ బౌలర్లపై బీభత్సం.. తొలి సెంచరీ బాదిన గిల్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 189 పరుగుల టార్గెట్ నిలిచింది.

Shubman Gill: 13 ఫోర్లు, 1 సిక్స్.. 174 స్ట్రైక్‌రేట్‌తో హైదరాబాద్ బౌలర్లపై బీభత్సం.. తొలి సెంచరీ బాదిన గిల్..
Shubman Gill Century
Follow us
Venkata Chari

|

Updated on: May 15, 2023 | 9:44 PM

Shubman Gill Century: ఐపీఎల్ 16వ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరుగుతోన్న మ్యాచ్‌లో గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌లో గిల్ అత్యధిక స్కోరు 96 పరుగులుగా నిలిచింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సున్నా స్కోరు వద్ద వృద్ధిమాన్ సాహా రూపంలో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి సాయి సుదర్శన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు.

ఈ మ్యాచ్‌లో గిల్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత, గిల్ వేగంగా పరుగులు చేయడం కొనసాగించాడు. 56 బంతుల్లో IPLలో తన మొదటి సెంచరీని పూర్తి చేశాడు. గిల్ 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 101 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు..

గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన రికార్డు కూడా శుభ్‌మన్ గిల్ పేరిట నమోదైంది. అంతకుముందు, 2022లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లో గుజరాత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు గిల్ పేరిట నమోదైంది. గిల్ ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో 48 సగటుతో 576 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ ఇన్నింగ్స్‌తో పాటు 4 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా నమోదయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కనిపించేదంతా కొబ్బరి పొడి అనుకుంటే పొరపాటే!
కనిపించేదంతా కొబ్బరి పొడి అనుకుంటే పొరపాటే!
బిగ్ బాస్‌ నుంచి రోహిణి ఎలిమినేట్.. 9 వారాలకు ఎంత సంపాదించిందంటే?
బిగ్ బాస్‌ నుంచి రోహిణి ఎలిమినేట్.. 9 వారాలకు ఎంత సంపాదించిందంటే?
12 ఇన్నింగ్స్‌ల్లో 143.. రిటైర్మెంట్ చేస్తే పరువైనా దక్కేను
12 ఇన్నింగ్స్‌ల్లో 143.. రిటైర్మెంట్ చేస్తే పరువైనా దక్కేను
మరికాసేపట్లో టీవీ9 వేదికగా గ్రాండ్‌ కాంక్లేవ్‌! మహామహుల చర్చాగోష్
మరికాసేపట్లో టీవీ9 వేదికగా గ్రాండ్‌ కాంక్లేవ్‌! మహామహుల చర్చాగోష్
TGPSC గ్రూప్‌ 1 రద్దుకు సుప్రీం నో.. రెండు పిటిషన్లు కొట్టివేత
TGPSC గ్రూప్‌ 1 రద్దుకు సుప్రీం నో.. రెండు పిటిషన్లు కొట్టివేత
'పవన్ కల్యాణ్ బాబాయి.. థ్యాంక్యూ సో మచ్': అల్లు అర్జున్
'పవన్ కల్యాణ్ బాబాయి.. థ్యాంక్యూ సో మచ్': అల్లు అర్జున్
వెలుగులోకి వస్తున్న ఆర్మీ కాలింగ్ సంస్థ అక్రమాలు..!
వెలుగులోకి వస్తున్న ఆర్మీ కాలింగ్ సంస్థ అక్రమాలు..!
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సూర్య కంగువా.. ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సూర్య కంగువా.. ఎక్కడ చూడొచ్చంటే?
36వ సెంచరీతో ఏకంగా టీమిండియా దిగ్గజానికే ఎసరెట్టేశావ్‌గా
36వ సెంచరీతో ఏకంగా టీమిండియా దిగ్గజానికే ఎసరెట్టేశావ్‌గా
టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే