Earthquake: పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భూకంపం.. ఆయా దేశాలకు సునామీ హెచ్చరిక..!

ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 6న టర్కీలో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ వ్యాప్తంగా సంభవించిన భూకంపం భీభత్సం సృష్టించింది. టర్కీలో ఒకదాని తర్వాత ఒకటి భూకంపం సంభవించి 33 వేల మందికి పైగా మరణించారు. వెలకట్టలేని ఆస్తులు ధ్వంసమయ్యాయి.

Earthquake: పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భూకంపం.. ఆయా దేశాలకు సునామీ హెచ్చరిక..!
Earthquake
Follow us

|

Updated on: May 20, 2023 | 10:57 AM

Earthquake In Pacific: పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతంలో వరుస భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 19న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం పరిసర ద్వీపం, ఖండాంతర ప్రాంతాలలో సునామీ ప్రమాదాన్ని పెంచింది. తాజాగా శనివారం ఉదయం కూడా అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. దీంతో స్థానిక ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. యుఎస్‌లోని న్యూ కలెడోనియా, ఫిజి, వనౌతు ప్రాంతాలకు ఈ హెచ్చరిక జారీ చేసింది.

సముద్ర ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో, న్యూ కలెడోనియన్‌ ద్వీపసమూహానికి తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించినట్లు నివేదించబడింది. ఈ పరిణామంతో సమీపంలోని ద్వీపదేశాలైన వనౌతు, ఫిజీ, న్యూకలెడోనియా, కిరిబాటి, వాలిస్‌, ఫుటునా దేశాలకు సునామీ పొంచి ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది.

టర్కీలో సంభవించిన భూకంపం..

ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 6న టర్కీలో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ వ్యాప్తంగా సంభవించిన భూకంపం భీభత్సం సృష్టించింది. ఈ భూకంప కేంద్రం దక్షిణ టర్కీలోని గజియాంటెప్. ప్రజలు కోలుకోకముందే, మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.4గా ఉంది. ఈ భూకంప ప్రకంపనల కాలం ఇక్కడితో ఆగలేదు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో షాక్‌ తగిలింది. టర్కీలో ఒకదాని తర్వాత ఒకటి భూకంపం సంభవించి 33 వేల మందికి పైగా మరణించారు. వెలకట్టలేని ఆస్తులు ధ్వంసమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..