AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పని మనిషికి రెండు కోట్ల శాలరీ.. ఒక్కరు కూడా అప్లై చేయలేదు.. ఎందుకంటే..

ఈ అంతుచిక్కని జాబ్ ఆఫర్ ఇప్పుడు చాలా మంది నిరుద్యోగుల దృష్టిని ఆకర్షించింది. కానీ చాలా మంది ఈ ఉద్యోగం చేయడానికి సిద్ధంగా లేరు. దీంతో ఈ జాబ్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జాబ్ ఆఫర్ ఏమిటో, ప్రజలు ఎందుకు నిరాకరిస్తున్నారో తెలుసుకుందాం.

పని మనిషికి రెండు కోట్ల శాలరీ.. ఒక్కరు కూడా అప్లై చేయలేదు.. ఎందుకంటే..
Job Of Personal Care Taker
Jyothi Gadda
|

Updated on: May 20, 2023 | 9:20 AM

Share

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో, నిరుద్యోగం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మనదేశంలో నిరుద్యోగ సమస్య ఎంతగా పెరిగిపోయిందంటే, చదువుకున్న యువత ఏ ఉద్యోగం చేసినా సరే.. దాంతో డబ్బు ఎలా సంపాదించుకోవాలో చూసేందుకు సిద్ధపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా రెండు కోట్ల జీతంతో ఉద్యోగం, ఉండేందుకు ఇల్లు, కడుపు నిండా భోజనం అందించే ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుంది..? ప్రతి ఒక్కరూ అలాంటి ఉద్యోగం పొందడానికే ప్రయత్నిస్తారు. ఇలాంటి ఉద్యోగ అవకాశం ఇప్పుడు ఒక దేశంలో నిజంగా అందుబాటులో ఉంది. కానీ చాలా మంది దీన్ని చేయడానికి సిద్ధంగా లేరు. దీంతో ఈ జాబ్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జాబ్ ఆఫర్ ఏమిటో, ప్రజలు ఎందుకు నిరాకరిస్తున్నారో తెలుసుకుందాం.

ఇంటి పనుల కోసం రెండు కోట్ల ప్యాకేజీ ..

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, షాంఘై మహిళ రోజుకు 24 గంటలూ తనతో ఉండే పర్సనల్ కేర్ టేకర్‌ కావాలని యాడ్ ఇచ్చారు. అయితే, అందుకు ఆమె కోట్ల రూపాయల జీతం ఇస్తున్నప్పటికీ.. కొన్ని షరతులు కూడా పెట్టింది. ఆ షరతుల ప్రకారం.. ఉద్యోగంలో చేరాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించేలా చేస్తుంది. కానీ,  ఈ ఉద్యోగం కోసం ఆ మహిళ మాత్రం  నెలకు రూ.16 లక్షలకు పైగా చెల్లించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ ఉద్యోగం కోసం ఇచ్చిన ప్రకటన ..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ప్రకారం, సంబంధిత మహిళను చూసుకోవడానికి పర్సనల్ కేర్ టేకర్‌కు నెలకు రూ. 1,644,435.25 అంటే సంవత్సరానికి రూ. 1.97 కోట్లు చెల్లిస్తారు. అయితే ఈ ఉద్యోగం కోసం ఆమె కొన్ని షరతులు పెట్టింది. ఈ షరతుల ప్రకారం, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే కేర్ టేకర్ తప్పనిసరిగా కనీసం 165 సెం.మీ పొడవు, 55 కిలోల కంటే తక్కువ బరువు ఉండాలి. అంతేకాకుండా, ఆమె 12వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ పూర్తి చేసి ఉండాలి. చూసేందుకు చక్కగా, నీట్‌గా కనిపించాలి. బాగా డ్యాన్స్ కూడా వచ్చి ఉండాలి. అంతేకాదు.. పాటలు కూడా పాడగలగాలి. హౌస్ కీపింగ్ సర్వీస్ చేసిన ఈ యాడ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, పర్సనల్ కేర్ టేకర్ అవసరమయ్యే మహిళకు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు రోజుకు 12 గంటలు పనిచేసి అదే వేతనం పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆమె వ్యక్తిగత సంరక్షణ టేకర్‌కి సంబంధించిన ఉద్యోగ ఆఫర్‌లో, ఆమె ఎలాంటి ఆత్మగౌరవం లేని వ్యక్తిని కోరుకుంటుందని చెప్పాలి. అంటే ఆమె తన కాలి షూ తీయమంటే కూడా తీయాలి. వేయమంటే వేయాలి. నీళ్లు అడిగినా ఇవ్వాలి..తక్షణమే ఎలాంటి జ్యూస్‌ కావాలంటే అది తెచ్చి అందించాలి. అలాగే ఉద్యోగ మర్యాదలో భాగంగా యజమానురాలి ఇంటికి వచ్చే ముందు కేర్ టేకర్ గేటు దగ్గరే వేచి ఉండాలి. ఈ అంతుచిక్కని జాబ్ ఆఫర్ ఇప్పుడు చాలా మంది నిరుద్యోగుల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వింత జాబ్ ఆఫర్లకు సంబంధించిన సంఘటనలు ఇంతకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..