తెలంగాణలో జెనెసిస్‌ పెట్టుబడి రూ. 497 కోట్లు.. మరో 300 మందికి ఉద్యోగావకాశం.. మంత్రి కేటీఆర్‌ సక్సెస్ టూర్..

అమెరికాకు చెందిన సివికా ఆర్ఎక్స్ అనే కంపెనీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ చేపట్టనున్నది. ఇప్పటికే తెలంగాణలో బయోటెక్ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. జెనెసిస్ వంటి కంపెనీల విస్తరణతో దీనికి మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో జెనెసిస్‌ పెట్టుబడి రూ. 497 కోట్లు.. మరో 300 మందికి ఉద్యోగావకాశం.. మంత్రి కేటీఆర్‌ సక్సెస్ టూర్..
Genesys Investment
Follow us

|

Updated on: May 20, 2023 | 7:35 AM

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా, మరో భారీ పెట్టుబడి, ఉద్యోగాల భర్తీతో మరో కంపెనీ తన విస్తరణను ప్రకటించింది. ప్రపంచ దిగ్గజ బయోటెక్ కంపెనీ ‘జెనెసిస్’ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో గతంలో రూ.415 కోట్ల పెట్టుబడి పెట్టిన ఆ సంస్థ.. మరో రూ.497 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇక్కడ రీకాంబినెట్ బల్క్ మాన్యుఫ్యాక్ఛరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. కాగా, జెనెసిస్ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మరో 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన సివికా ఆర్ఎక్స్ అనే కంపెనీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ చేపట్టనున్నది. ఇప్పటికే తెలంగాణలో బయోటెక్ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. జెనెసిస్ వంటి కంపెనీల విస్తరణతో దీనికి మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ రెండు కంపెనీలు ఇన్సులిన్ తయారీలో ముందున్నాయి. అతి తక్కువ ధరకు ఇన్సులిన్ అందిస్తూ డయాబెటిక్ పేషెంట్లకు తోడ్పాటును అందిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న జెనెసిస్ ఒక బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది అత్యంత నాణ్యమైన, సరసమైన ధరలకుదొరికే మెడిసిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. జెనెసిస్ క్యాటలాగ్‌లో ఇన్సులిన్ కీలకంగా ఉంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. విస్తరణ అనంతరం మరో 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), న్యాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) ఆధారిత ఉత్పత్తుల తయారీలో పేరొందిన జాప్‌కామ్‌ కంపెనీ తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

Latest Articles
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..
అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాంః అమిత్ షా
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాంః అమిత్ షా