Telangana: దేవుడు కలలో చెప్పాడని.. గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు.. 8 మంది అరెస్ట్
అజ్మీరా విజయ దంపతులు తమ బంధువులను పిలిచి ఇంటి ఈశాన్యంలో 8 అడుగుల మేర పెద్ద గుంత తవ్వారు. ఇంట్లో నుండి తవ్వకాల శబ్దాలు, మట్టి తోడుతుండటంతో స్థానికులు వచ్చి చూశారు. వారు డొంకతిరుగుడు సమాధానం చెబుతుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
ఆధునిక కాలంలోనూ మనుషుల్లో మూఢనమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. గుప్త నిధుల కోసం ఇంట్లో 8 అడుగుల లోతులో పెద్ద గుంత తవ్విన ఘటన భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావుసింగ్‌పల్లికి చెందిన అజ్మీరా సారయ్య, విజయ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటారు. వారం రోజులుగా దేవుడు కలలోకి వచ్చి ఇంట్లో బంగారం ఉందని చెప్పాడంటూ.. అజ్మీరా విజయ దంపతులు తమ బంధువులను పిలిచి ఇంటి ఈశాన్యంలో 8 అడుగుల మేర పెద్ద గుంత తవ్వారు. ఇంట్లో నుండి తవ్వకాల శబ్దాలు, మట్టి తోడుతుండటంతో స్థానికులు వచ్చి చూశారు. వారు డొంకతిరుగుడు సమాధానం చెబుతుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
అజ్మీరా సారయ్య, విజయ దంపతుల ఇంట్లోకి వెళ్లిన పోలీసులు లోపల పెద్ద గుంత తీసినట్లు గుర్తించారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపడుతున్నట్లు ఒప్పుకున్నారు. గుప్తు నిధుల పేరుతో తవ్వకాలు చేపట్టిన 8మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు చిట్యాల పోలీసులు. ఇక.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగిన విషయం ఆ నోటా ఈ నోటా బావుసింగ్‌పల్లి గ్రామమంతా తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..