Rain Alert: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్.. వచ్చే మూడు రోజులు వర్షాలు.
మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది...
మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇక హైదరాబాతోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు దిగువ స్థాయి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలోని కొన్ని భాగాల వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..