AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త కారు కొన్న ఆనందం.. షోరూమ్‌లోనే ఫ్యామిలీ చేసిన హంగామా మామూలుగా లేదు… ఆనంద్‌ మహీంద్రా ఫిదా..

చాలా కాలంగా ఎదురుచూస్తున్న కల సార్ ఇది.. హ్యాపీగా ఉండటం సహజం అని ఓ యూజర్ రాశాడు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు, ఇది ఆనందం కేవలం ఆనందం మాత్రమే అని చెప్పాడు. మరొక యూజర్ ఫన్నీ కామెంట్ చేసి, అది కట్నంగా వచ్చిందని రాశాడు! ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై యూజర్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

కొత్త కారు కొన్న ఆనందం.. షోరూమ్‌లోనే ఫ్యామిలీ చేసిన హంగామా మామూలుగా లేదు... ఆనంద్‌ మహీంద్రా ఫిదా..
Anandh Mahindra
Jyothi Gadda
|

Updated on: May 20, 2023 | 8:56 AM

Share

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా కొత్త కారు కొనాలని కలలు కంటారు. చాలామందికి ఈ కల నిజమవుతుంది మరి కొందరికి కలగానే మిగిలిపోతుంది. భారతదేశంలో ఇప్పటికీ కారు సంపదకు చిహ్నంగానే పరిగణిస్తుంటారు. ఇంటి ముందు పెద్ద కారు పెడితే ఆ కుటుంబం ధనవంతులని నేటికీ నమ్ముతారు. కారు కొనడం వెనుక చాలా మంది మనోభావాలు దాగి ఉన్నాయి. కొత్త కారు కొనడం అంటే చాలా కుటుంబాలకు కల నిజమైనట్టే. కుటుంబ సమేతంగా షోరూమ్‌కి వెళ్లి కారు కొనుక్కోవడంలో ఉన్న ఆనందమే వేరు. ఒక్కోక్కరి ముఖంలో ఒక్కోరకమైన ఆనందాన్ని చూస్తుంటాం.. అలాంటిదే ఒక ఫ్యామిలీ మెంబర్స్‌ కారు కొనేందుకు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు.

వీడియో చూస్తుంటే.. కారు కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లో ఒక కుటుంబం ఆనందంతో గెంతులు వేయటం, డ్యాన్స్‌లు చేయటం చేస్తుంది. వారు మహీంద్రా స్కార్పియో N SUV కారును కొనుగోలు చేసింది. ఈ వీడియోను @CarNewsGuru1 అనే హ్యాండిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్యాప్షన్‌లో, – ఎంత సంతోషకరమైన వాతావరణం అని రాసి ఉంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని డెలివరీ చేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. వైరల్‌ అవుతున్న వీడియో ఆధారంగా వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను మే 19న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, భారత ఆటో పరిశ్రమలో పనిచేయడం నిజమైన బహుమతి సంతోషం…. అతని ట్వీట్‌కి ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా వ్యూస్‌ వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. . చాలా కాలంగా ఎదురుచూస్తున్న కల సార్ ఇది.. హ్యాపీగా ఉండటం సహజం అని ఓ యూజర్ రాశాడు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు, ఇది ఆనందం కేవలం ఆనందం మాత్రమే అని చెప్పాడు. మరొక యూజర్ ఫన్నీ కామెంట్ చేసి, అది కట్నంగా వచ్చిందని రాశాడు! ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై యూజర్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..