AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC : తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. రూ. 5 వేల ధరలో 4 రోజుల టూర్, ఈ కొత్త ప్యాకేజీ చూడండి

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ నుంచి చెక్ అవుట్ అవ్వాలి. అనంత‌రం వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఉదయం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . తిరుగు ప్రయాణంలో రాత్రి 08.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరుతుంది. మళ్లీ ..

IRCTC : తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. రూ. 5 వేల ధరలో 4 రోజుల టూర్, ఈ కొత్త ప్యాకేజీ చూడండి
Irctc Govindam Package
Jyothi Gadda
|

Updated on: May 20, 2023 | 12:04 PM

Share

వేసవి సెలవుల్లో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. కుటుంబ సమేతంగా తిరుపతి టూర్ ప్లాన్‌ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్‌న్యూస్‌ అందించింది. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ ప్రజలకు ఇది బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. ఎందుకంటే.. కరీంనగర్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది IRCTC Tourism. ‘సప్తగిరి’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి తిరుమలలోశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు కవర్ అవుతాయి. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ గురువారం ఈ టూర్ ప్యాకేజీ కరీంనగర్, వరంగల్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

సప్తగిరి ఎక్స్ కరీంనగర్ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఈ జూన్ 1వ తేదీన‌ ఈ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా తిరుచానూర్ , కాణిపాకం , తిరుపతి, తిరుమల, శ్రీనివాస మంగాపురం కూడా సందర్శించే అవకాశం కల్పించింది.. కరీంనగర్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. ఇకపోతే, ఈ నాలుగు రోజుల పర్యటనలో ఏ ఏరోజు ఎక్కడికి అన్న వివరాల్లోకి వెళితే..

Day 1: మొదటి రోజు కరీంనగర్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. కరీంనగర్ నుండి రాత్రి 07.15 గంటలకు రైలు బయలుదేరి.. పెద్దపల్లి కి రాత్రి 8.05 గంటలకు చేరుకుంటుంది. వరంగల్ నుంచి రాత్రి 9.15 గంటలకు, ఖమ్మం నుంచి రాత్రి 11 బయలుదేరుతుంది. మీరు ఆ రాత్రంత రైల్లో ఉంటారు. తెల్లవారే సరికి తిరుపతి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

Day 2: రెండో రోజు ఉదయం 07:50 గంటలకు ట్రైన్‌ మిమ్మల్ని తిరుపతిలో దించుతుంది. ఐఆర్‌సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శనకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. అనంత‌రం హోటల్‌కి తిరిగి వెళ్తారు. భోజనం త‌ర్వాత రాత్రి తిరుపతిలో బస ఉంటుంది.

Day 3: మూడో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ నుంచి చెక్ అవుట్ అవ్వాలి. అనంత‌రం వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఉదయం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . తిరుగు ప్రయాణంలో రాత్రి 08.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరుతుంది. మళ్లీ రాత్రి ప్రయాణం.. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 4: తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం చేరుకుంటారు, వరంగల్‌కు 04.41 గంటలకు, పెద్దపల్లికి 05.55 గంటలకు, కరీంనగర్‌కు ఉదయం 08.40 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధ‌ర వివరాలు..

ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.9,010 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ. 7,640, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.7,560గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7120గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5740, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5660గా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..