RS 2000 Notes: రూ. 2వేల నోటు ఉపసంహరణపై ఎన్నో ప్రశ్నలు.. ఆర్‌బీఐ చెబుతోన్న సమాధానాలు ఇవే.

రూ. 2 వేల నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రూ. 2 వేల నోటు ఉపసంహరణ అంశం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని.. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ 2023, మే 19వ తేదీన ఆర్బీఐ..

RS 2000 Notes: రూ. 2వేల నోటు ఉపసంహరణపై ఎన్నో ప్రశ్నలు.. ఆర్‌బీఐ చెబుతోన్న సమాధానాలు ఇవే.
Rs 2000 Notes
Follow us
Narender Vaitla

|

Updated on: May 20, 2023 | 12:14 PM

రూ. 2 వేల నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రూ. 2 వేల నోటు ఉపసంహరణ అంశం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని.. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ 2023, మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే దీనిపై ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రూ. 2 వేల నోటు ఉపసంహరణపై ఉన్న అనుమాలు ఏంటి.? నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* నోట్ల మార్చుకోవడానికి బ్యాంకుల్లో ఏదైనా ఫీజు చెల్లించాలా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. నోట్ల మార్చుకోవడానికి ఏ ఫీజూ చెల్లించే అవసరం లేదని, ఉచితంగానే మార్చుకోవచ్చని పేర్కొంది.

* వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవడానికి వస్తే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

ఇవి కూడా చదవండి

* 2 వేల నోట్లను ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినా, మార్చుకోకపోయినా ఏమవుతుందన్న విషయంపై ఆర్బీఐ ఓ సమాధానం చెప్పింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా 5 నెలల గడువు ఇచ్చామని చెప్పింది. ఆ సమయంలో 2 వేల నోట్లు మార్చుకోవాలని లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని పేర్కొంది. ప్రజలను ఈ మేరకు ప్రోత్సహిస్తున్నామని మాత్రమే ఆర్బీఐ చెప్పింది.

* ఒకవేళ బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే ఏంటి సంగతన్న విషయంపై కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది. మొదట ఆ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.

* రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని నోటును రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

* రూ. 2 వేల నోట్లు ఉన్న వారు సెప్టెంబరు 30లోపు ఏ బ్యాంకులోనైనా తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చని తెలిపింది.

* ఇక రూ. 2 వేల నోట్ల మార్పిడి పరిమితిపై స్పందించిన ఆర్‌బీఐ కేవైసీ, ఇతరత్రా చట్టబద్ధమైన, నియంత్రణ పరమైన నిబంధనలకు లోబడి ఎలాంటి నియంత్రణ లేకుండా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

* నోటు మార్చుకోవడానికి బ్యాంకు ఖాతాదారుడై ఉండాల్సిన అవసరం లేదని, ఖాతాలేని వారు కూడా ఒక్కోసారి బ్రాంచ్‌ల్లో రూ.20వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?