AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan Health:ఇమ్రాన్ ఖాన్‌ను వెంటాడుతున్న కష్టాలు.. కడుపునొప్పితో ఆస్పత్రి పాలు..

మెడికల్ చెకప్ అనంతరం ఇమ్రాన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి..  ఇంటికి తిరిగి వచ్చాడు. ఇమ్రాన్‌కు తీవ్రమైన కడుపునొప్పి  కారణంగా తీవ్ర బాధడ్డారని.. దీంతో హుటాహుటిన  ఆసుపత్రికి తీసుకెళ్లారని సన్నిహితులు చెప్పారు. వైద్యుల బృందం అతనికి చికిత్స అందించింది. 

Imran Khan Health:ఇమ్రాన్ ఖాన్‌ను వెంటాడుతున్న కష్టాలు.. కడుపునొప్పితో ఆస్పత్రి పాలు..
Imran Khan
Surya Kala
|

Updated on: May 20, 2023 | 1:16 PM

Share

దాయాది దేశం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఇమ్రాన్ ఖాన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ ఆయన ఆరోగ్యం క్షీణించడంపై ఓ వీడియోను ట్వీట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇమ్రాన్‌ను చికిత్స నిమిత్తం లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ వైద్యులు చికిత్సనందించినట్లు తెలుస్తోంది.

దునియా న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. మెడికల్ చెకప్ అనంతరం ఇమ్రాన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి..  ఇంటికి తిరిగి వచ్చాడు. ఇమ్రాన్‌కు తీవ్రమైన కడుపునొప్పి  కారణంగా తీవ్ర బాధడ్డారని.. దీంతో హుటాహుటిన  ఆసుపత్రికి తీసుకెళ్లారని సన్నిహితులు చెప్పారు. వైద్యుల బృందం అతనికి చికిత్స అందించింది.  ఇమ్రాన్‌కు పలు పరీక్షలు కూడా చేశారు. ఇమ్రాజ్ ను ఆస్పత్రికి తరలించే సమయంలో దారి పొడవునా, ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇమ్రాన్ పరిస్థితి చూస్తుంటే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని అనారోగ్య కారణాలతో గతంలో కూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇమ్రాన్‌ పై పలు కేసులు నమోదయ్యాయి, ప్రతిరోజూ కోర్టుకు వెళ్లి బెయిల్ ఇవ్వమని అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు అతని ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ పార్టీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని ఇమ్రాన్ శుక్రవారం పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం తనను కలవడానికి ఇంటికి వచ్చి పీటీఐలోని ఎనిమిది మంది నేతల పేర్లు చెప్పారు. మొత్తానికి పీటీఐలోని నేతలంతా వాంటెడ్‌ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

జమాన్ పార్క్‌లోని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు అధికారులు తనని అనుమతి కోరారని ఇమ్రాన్ చెప్పారు. అయితే తాను వారి డిమాండ్లను పూర్తిగా తిరస్కరించానని వెల్లడించారు. లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తిరిగి అధికారులు తన ఇంటిని సోదాచేయడానికి రాగలరని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..