AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లక్ అంటే వీడిదే.. ఒక్క లాటరీతో సుడి తిరిగింది.. వారానికి రూ.82 వేలు.. జీవితాంతం.!

ఒక్క లాటరీతో అతడి సుడి తిరిగింది. దెబ్బకు లైఫ్ సెట్ అయిపోయింది. ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. తాజాగా అతడికి..

Viral: లక్ అంటే వీడిదే.. ఒక్క లాటరీతో సుడి తిరిగింది.. వారానికి రూ.82 వేలు.. జీవితాంతం.!
Lottery
Ravi Kiran
|

Updated on: May 22, 2023 | 1:52 PM

Share

ఒక్క లాటరీతో అతడి సుడి తిరిగింది. దెబ్బకు లైఫ్ సెట్ అయిపోయింది. ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. తాజాగా అతడికి ఓ వినూత్న లాటరీ తగిలింది. దీంతో అతడికి వారానికి రూ. 82 వారాల చొప్పున జీవితాంతం డబ్బులు పొందనున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రానికి చెందిన రాబిన్ రైడెల్ అనే ట్రక్ డ్రైవర్ 14 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ వచ్చాడు. సరిగ్గా ఒకటిన్నర దశాబ్దం తర్వాత అతడి సుడి తిరిగింది. ‘విన్ ఫర్ లైఫ్’ అనే లాటరీ తగిలింది. ఇందులో గెలిచిన అతడికి వారం.. వారం.. పాటు జీవితాంతం డబ్బులు వస్తాయి. సదరు లాటరీ కంపెనీ రాబిన్‌కు ప్రతీ వారం వెయ్యి డాలర్ల(భారత కరెన్సీలో రూ. 82 వేలు) చొప్పున.. జీవితాంతం డబ్బులు ఇస్తూనే ఉంటారు.

ఇంతటి బంపర్ ఆఫర్ తగిలినందుకు రాబిన్ తెగ సంబరపడుతుండగా.. వచ్చే రెండు లేదా మూడేళ్ల తన డ్రైవింగ్‌కు గుడ్ బై చెప్తానని పేర్కొన్నాడు. లాటరీ రూపంలో ప్రతీ వారం వచ్చే డబ్బుతో సొంతిల్లు కట్టుకోవడమే కాకుండా.. భవిష్యత్తు కోసం కొంత వెనకేసుకుంటానని రాబిన్ తెలిపాడు. ఇక అతడి అదృష్టం చుట్టుప్రక్కల వారందరికీ తెలియడంతో.. ఈ వార్త కాస్తా స్థానికంగా వైరల్ అవుతోంది.

Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..