Viral: గిఫ్ట్ బాక్సుల్లో వాడిపారేసిన కండోమ్స్.. ఏకంగా 65 మంది మహిళలకు.. వెలుగులోకి షాకింగ్ నిజం!
అసలు ఇది ఎవ్వరూ ఊహించని ఘటన. ఆ మహిళలందరికీ గిఫ్ట్ బాక్సులు పార్శిల్ రూపంలో ఇంటికొచ్చాయి. అందులో ఏమున్నాయో వారికి తెలియదు. కానీ ఓపెన్ చేసి చూశాక వారందరికీ ఫ్యూజులౌట్..
అసలు ఇది ఎవ్వరూ ఊహించని ఘటన. ఆ మహిళలందరికీ గిఫ్ట్ బాక్సులు పార్శిల్ రూపంలో ఇంటికొచ్చాయి. అందులో ఏమున్నాయో వారికి తెలియదు. కానీ ఓపెన్ చేసి చూశాక వారందరికీ ఫ్యూజులు ఎగిరిపోవడమే కాదు. వారిలో భయాందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ ఘటన అక్కడ స్థానికంగా సంచలనం అయింది.
గడిచిన మూడు నెలల్లో ఒకరిద్దరు కాదు.. ఏకంగా 65 మంది మహిళలకు వాడిపారేసిన కండోమ్స్‌ను గిఫ్ట్ బాక్సుల్లో పంపించాడు ఓ అజ్ఞాత వ్యక్తి. అంతేకాదు.. వాటితో పాటు అందరకీ లెటర్లు కూడా పంపాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటు చేసుకోగా.. వారందరూ కూడా ఒకే స్కూల్‌లో చదవడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అలాగే ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
సదరు మహిళలు అందరూ కూడా 1999వ సంవత్సరంలో మెల్‌బోర్న్‌లోని కిల్‌బ్రేడా బాలికల పాఠశాలలో చదువుకున్నారని తెలుస్తోంది. ఆ స్కూల్‌కు సంబంధించిన రికార్డు బుక్‌లో వారి డీటెయిల్స్ సేకరించి.. నిందితుడు పోస్టు ద్వారా గిఫ్ట్ బాక్సులు పంపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కండోమ్స్‌తో పాటు ఆ అజ్ఞాత వ్యక్తి పంపించిన లెటర్స్‌లో అసభ్యకరమైన భాషను ఉపయోగించినట్లు మహిళలు తెలిపారు. కాగా, ఈ కేసుపై పోలీసులు వేగంగా దర్యప్తు చేస్తుండగా.. విచారణలో భాగంగా ఆ పాఠశాలకు సంబంధించిన వారందరినీ విచారిస్తున్నారు.(Source)