Viral: బ్రేకప్ చెప్పిన 3 ఏళ్ల తర్వాత మెసేజ్.. దాన్ని చూడగా గర్ల్‌ఫ్రెండ్‌కు దిమ్మతిరిగే షాక్!
సాధారణంగా ఓ బంధం నుంచి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత యువతీయువకులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, లేదా అన్నీ మర్చిపోయి ఎవరి దారి వారు చూసుకోవడం లాంటివి జరుగుతుంటాయి.
సాధారణంగా ఓ బంధం నుంచి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత యువతీయువకులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, లేదా అన్నీ మర్చిపోయి ఎవరి దారి వారు చూసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇక్కడొక వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ నుంచి విడిపోయిన 3 ఏళ్లకు ఓ మెసేజ్ పంపించాడు. అందులో అతడు అడిగిన దానికి ఆమె మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ అసలు అతడేం అడిగాడో ఇప్పుడు తెలుసుకుందామా..!
వివరాల్లోకి వెళ్తే.. బ్రేకప్ చెప్పిన మూడేళ్ల తర్వాత ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలికి మెసేజ్ చేశాడు. అది చూడగానే తన మైండ్ బ్లాంక్ అయిందని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో తన అనుభవాన్ని పంచుకుంది. విడిపోయిన 3 సంవత్సరాల తర్వాత, తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్ ద్వారా తనను డబ్బులు తిరిగి ఇవ్వమన్నాడని చెప్పింది. సరిగ్గా మూడేళ్ల క్రితం ట్రేసీ, పీటర్ మధ్య మొత్తం హ్యాపీగా సాగుతోంది. ఆ సమయంలో ట్రేసీ పుట్టినరోజు ఉండటంతో.. ఆమెకు పీటర్ రూ. 18 వేలు విలువ చేసే బహుమతిని ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆ డబ్బును తిరిగి డిమాండ్ చేస్తున్నాడు పీటర్. వారిద్దరి మధ్య ఈ గిఫ్ట్ విషయంలో కొంచెం వాగ్వాదం జరగ్గా.. చివరికి డబ్బును తిరిగి ఇచ్చింది ట్రేసీ. అలాగే ఎవరికైనా ఏదైనా బహుమతి ఇస్తే.. దాన్ని తిరిగి ఇవ్వొద్దని సలహా కూడా ఇచ్చింది. కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.