ఓరి నీ వేషాలో.. హీరోలా ఫీలై ఇద్దరబ్బాయిలతో బైక్‌ స్టంట్‌.. తర్వాత ఏమైందంటే..

అలాంటి వీడియోలు యూజర్ల కళ్లు బైర్లు కమ్మేలా  చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి స్టంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటపడింది. ఇందులో ముగ్గురు యువకులు బైక్ నడుపుతున్నారు. అంతేకాదు, బైక్‌ తో భయంకర విన్యాసాలు కూడా చూపిస్తున్నారు.

ఓరి నీ వేషాలో.. హీరోలా ఫీలై ఇద్దరబ్బాయిలతో బైక్‌ స్టంట్‌.. తర్వాత ఏమైందంటే..
Dangerous Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: May 22, 2023 | 3:38 PM

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా స్టంట్ వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్‌ కావాలనే కోరికతో చాలా మంది చిత్ర విచిత్ర స్టంట్స్‌ చేస్తుంటారు. అలాంటి బైక్ స్టంట్స్‌ చూసి యూజర్లు కూడా షాక్‌ అవుతున్నారు. పలు సందర్భాల్లో భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అవాక్కయ్యేలా విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తున్న యువకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి వీడియోలు యూజర్ల కళ్లు బైర్లు కమ్మేలా  చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి స్టంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటపడింది. ఇందులో ముగ్గురు యువకులు బైక్ నడుపుతున్నారు. అంతేకాదు, బైక్‌ తో భయంకర విన్యాసాలు కూడా చూపిస్తున్నారు.

సాధారణంగా మన దేశంలో యువత బైక్‌లపై ప్రయాణిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపిస్తుంటారు. ఈ సమయంలో కొంత మంది బైక్‌ను ఫుల్ స్పీడ్‌తో నడుపుతూ దాని ముందు లేదా వెనుక చక్రాన్ని గాలిలోకి ఎత్తుతుంటారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు బైక్‌పై నిలబడి లేదా హ్యాండిల్‌ను వదిలి వెహికిల్‌ నడుపుతుంటారు. ఇటీవల బయటపడ్డ ఓ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్‌ను పాములా నడిపిస్తున్నాడు. పైగా అతని బైక్‌పై మొత్తం ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. ఇక బైక్‌ నడుపుతున్న కుర్రాడు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ పాములా బైక్‌ను ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు రయ్‌మంటూ చక్కర్లు కొడుతున్నాడు. ఇంతలో ఆ యువకుడు బైక్‌పై బ్యాలెన్స్ తప్పటంతో ముగ్గురూ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. బైక్‌ వేగానికి ఆ ముగ్గురు యువకులు అక్కడే పడిపోయారు.. కానీ బైక్‌ మాత్రం అంతదూరం వరకు వెళ్లిపోయింది. ఇలాంటి విపరీత దోరణుల వల్ల ఇప్పటికే చాలా మంది యువకుల ప్రాణాలను బలిగొంటుంది. పోలీసులు తరచూ హెల్మెట్‌ ధరించాలని సలహాలు ఇస్తున్నా, తనిఖీలు, ఛాలానలు వేస్తున్న యువకులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆకతాయి పనులు, భయంకర స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను @NehaAgarwal_97 అనే ప్రొఫైల్ ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియోకి లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ స్పందన తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..