మందుబాబులకు సూపర్‌ న్యూస్‌..! అందుబాటులోకి లిక్కర్‌ ఏటీఎంలు.. ఇక మీ ఇష్టానికే..!!

ప్రస్తుతం, మద్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఈ వెండింగ్ మెషీన్‌పై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వెండింగ్ మెషీన్ల వల్ల మైనర్లకు మద్యం కొనుగోలు చేయడం సులభతరం అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, పిల్లలు వాటిని ఉపయోగించకుండా వెండింగ్ మెషీన్‌ల వద్ద వ్యక్తులను నియమిస్తామని రాష్ట్ర పరిపాలన విభాగం తెలిపింది.

మందుబాబులకు సూపర్‌ న్యూస్‌..! అందుబాటులోకి లిక్కర్‌ ఏటీఎంలు.. ఇక మీ ఇష్టానికే..!!
Liquor Vending Machine
Follow us
Jyothi Gadda

|

Updated on: May 22, 2023 | 6:34 PM

దేశంలో మందుబాబులకు కొదువేలేదు.. కో అంటే కోటి మంది తాగుబోతులు ప్రత్యక్షమవుతారు. మద్యం దుకాణాల ముందు బారులుతీరి కనిపించే క్యూలైన్లే ఇందుకు నిదర్శనం. బారులు తీరిన జనంలో నిలబడి విచ్చలవిడిగా డబ్బులు పోసి కావాల్సిన మందుసీసాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే కొన్ని కొన్ని సార్లు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ చెల్లించి మద్యం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆల్కహాల్ తాగేవారికి ఇలాంటి అనేక సమస్యలు ఎప్పుడూ ఉండేవి. అయితే ఇప్పుడు వారి కష్టాలు తీరిపోయే మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇకపై మద్యం కొనాలంటే మద్యం షాపుల ముందు క్యూ కట్టాల్సిన పనిలేదు. చాలా ఈజీగా, హైటెక్‌ పద్దతిలో కావాల్సిన బ్రాండ్‌ కొనుగోలు చేసుకోవచ్చు. ఎలాగంటే.. మద్యం కొనుగోలుదారుల కోసం ఇక్కడ ఒక మాల్‌లో ప్రభుత్వ మద్యం విక్రయ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు ATM మెషీన్ల నుండి డబ్బు విత్‌డ్రా చేసుకునే విధంగానే ఈ యంత్రాల నుండి మద్యం కొనుగోలు చేయగలుగుతారు. ఈ విధానం తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి ప్రభుత్వ మద్యం విక్రయ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) చెన్నైలోని ఒక మాల్‌లోని ఎలైట్ స్టోర్‌లో స్వయంప్రతిపత్తమైన మద్యం విక్రయ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మెషీన్ల వద్ద మద్యం కొనుగోలుదారులు చెల్లించే ముందు తమకు నచ్చిన మద్యాన్ని ఎంచుకోవచ్చు. మెషీన్ స్క్రీన్‌పై ప్రదర్శించబడే గాడ్జెట్ నుండి బాటిల్‌ను స్వీకరించవచ్చు. దీంతో కౌంటర్‌లో మద్యం కోసం ఎక్కువ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులను తగ్గించే అవకాశం ఉంది. ఈ యంత్రం ద్వారా ఎంఆర్‌పీకి మద్యం విక్రయిస్తారు.

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం, ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా జరుగుతోంది. మిగతా చోట్ల ఏవిధంగా అమలు చేయాలనేది పాలనా యంత్రాంగం నిర్ణయించలేదు. పైగా ఇలాంటి లిక్కర్ వెండింగ్ మెషీన్లు ప్రారంభిస్తారో లేదో కూడా సరైన సమాచారం లేదు. ప్రస్తుతం, మద్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఈ వెండింగ్ మెషీన్‌పై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వెండింగ్ మెషీన్ల వల్ల మైనర్లకు మద్యం కొనుగోలు చేయడం సులభతరం అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, పిల్లలు వాటిని ఉపయోగించకుండా వెండింగ్ మెషీన్‌ల వద్ద వ్యక్తులను నియమిస్తామని రాష్ట్ర పరిపాలన విభాగం తెలిపింది. ఒక ప్రైవేట్ కంపెనీ సహాయంతో ఈ యంత్రం ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది.

ఈ మద్యం విక్రయ యంత్రానికి సంబంధించి, తమిళనాడు మంత్రి బాలాజీ ATM రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉందని, దానిని నిర్వహించడానికి సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ మెషిన్‌ను ప్రైవేట్‌ రంగ సంస్థ ఏర్పాటు చేసిందని కూడా ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింఖ్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!