Ram Charan: గ్లోబల్ స్టారా మాజాకా..? భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తరఫున జీ-20 సదస్సుకు
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ - 20 సమావేశాలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఆర్థిక పురోగతిలో ఫిల్మ్ టూరిజం పాత్ర, సాంస్కృతిక పరిరక్షణ అంశాలపై ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ – 20 సమావేశాలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యాడు. ఆర్థిక పురోగతిలో ఫిల్మ్ టూరిజం పాత్ర, సాంస్కృతిక పరిరక్షణ అంశాలపై జరుగుతున్న ఈ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు చెర్రీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే అరుదైన గౌరవం చరణ్‌కు దక్కింది. ఎంతో అద్భుతమై ప్రకృతి అందాలతో నిండి ఉండే కశ్మీర్‌లో ఈ కార్యక్రమం జరగడం హ్యాపీగా ఉందన్నారు చరణ్. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో.. 2016లో తాను ఓ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. జపాన్ గురించి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు రామ్ చరణ్. RRR షూటింగ్ సమయంలో ఆ దేశంలో పర్యటించామని.. అక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పుకొచ్చారు.
కాగా ఈ కార్యక్రమంలో నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించారు చరణ్. భారత్‌కు దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె.బోక్‌తో కలిసి కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియో ప్రజంట్ నెట్టింట్ ట్రెండ్ అవుతుంది. దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ – ఏ – కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో మే 22( సోమవారం) మొదలైన ఈ సదస్సు మే 24 వరకు జరగనుంది.
Actor @AlwaysRamCharan dances to the tunes of ‘Naatu Naatu’ with Korean ambassador during G20 meeting#NaatuNaatu #G20Kashmir #G20InKashmir pic.twitter.com/yzPU6fTGNo
— Parul Sabherwal (@parulsabherwal) May 22, 2023