Keerthy Suresh: కీర్తి లైఫ్‌లో మిస్టరీ మ్యాన్.. తొలిసారి పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్..
ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా కీర్తి వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా కీర్తి ప్రేమ, పెళ్లి వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. అయితే గతంలో కీర్తి పెళ్లి వార్తలను ఆమె తల్లి మేనక ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా తొలిసారి ప్రేమ, పెళ్లి రూమర్స్ పై స్పందించింది కీర్తి. తన జీవితంలో మిస్టరీ మ్యాన్ వస్తారంటూ చెప్పేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతూ.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో హిట్స్ అందుకుంటుంది కీర్తి సురేష్. మహానటి సినిమాతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వెన్నెల పాత్రతో మరోసారి తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది. న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో పక్కా మాస్ పిల్ల వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది కీర్తి. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా కీర్తి వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా కీర్తి ప్రేమ, పెళ్లి వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. అయితే గతంలో కీర్తి పెళ్లి వార్తలను ఆమె తల్లి మేనక ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా తొలిసారి ప్రేమ, పెళ్లి రూమర్స్ పై స్పందించింది కీర్తి. తన జీవితంలో మిస్టరీ మ్యాన్ వస్తారంటూ చెప్పేసింది.
“హ్హహ్హహ్హ.. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి లాగేసారా. (కాబోయే వరుడిని ఉద్దేశిస్తూ) నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదు.” అంటూ ట్వీట్ చేసింది కీర్తి సురేష్.




అయితే ఇటీవల కీర్తి తన స్నేహితుడు.. దుబాయ్ లో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఓ వ్యక్తితో కలిసి కీర్తి దిగిన ఫోటో నెట్టింట వైరల్ కావడంతో.. మిస్టరీ మ్యాన్ తో కీర్తి సురేష్ వివాహం జరుగుతుందని.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. అలా వచ్చిన ఓ వార్తపై కీర్తి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ ఫోటోలో తన పక్కన ఉన్న వ్యక్తి స్నేహితుడని.. పెళ్లి ఫిక్స్ కాగానే కాబోయే భర్తను పరిచయం చేస్తానని తెలిపారు. గతంలో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో పెళ్లంటూ వార్తలు రాగా.. అవన్నీ వదంతులేనని ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు.
Hahaha!! Didn’t have to pull my dear friend, this time!
I will reveal the actual mystery man whenever I have to ? Take a chill pill until then!
PS : Not once got it right ? https://t.co/wimFf7hrtU
— Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




