Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై లోకల్ ట్రైన్‌లో అనుకోని అతిథి.. వారికి విశ్వాసమే కాదు.. అన్ని ఎక్కువే..!! వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..

ప్రయాణికులేవరూ ఇంతవరకు చూడని, ఊహించని, అనుకోని ఓ అతిధి ప్రయాణం ప్రత్యేకతను సంతరించుకుంది. అదేంటంటే.. తాజాగా ఓ కుక్క ప్రతిరోజూ లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నట్టుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యంతో పాటు ఆనందపడేలా చేసింది.

ముంబై లోకల్ ట్రైన్‌లో అనుకోని అతిథి.. వారికి విశ్వాసమే కాదు.. అన్ని ఎక్కువే..!! వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Dog Travel Local Train
Follow us
Jyothi Gadda

|

Updated on: May 22, 2023 | 7:16 PM

ఇటీవల మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్ లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది.  రోజూ లెక్కలేనంత మంది ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది ముంబై లోకల్ ట్రైన్‌. నిత్యం రద్దీగా ఉండే ముంబై లోకల్‌ ట్రయిన్‌లో హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన ప్రతినిత్యం రైల్లో ప్రయాణించే వారిని ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రయాణికులేవరూ ఇంతవరకు చూడని, ఊహించని, అనుకోని ఓ అతిధి ప్రయాణం ప్రత్యేకతను సంతరించుకుంది. అదేంటంటే.. తాజాగా ఓ కుక్క ప్రతిరోజూ లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నట్టుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యంతో పాటు ఆనందపడేలా చేసింది.

వైరల్‌గా మారిన వీడియోలో..ముంబై రైలులో నిత్యం ప్రయాణించే వీధికుక్క అందులోకి ప్రవేశించడం కనిపిస్తుంది. బోరివాలి నుంచి అంధేరి స్టేషన్ వరకు ఆ కుక్క ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వెళ్లి ఓ మూలన కిందే కూర్చుంటుంది ఆ శునకం. దాని స్టేషన్ వచ్చే ముందు డోర్ దగ్గరగా వచ్చి నిలబడి ప్రశాంతంగా బయటకు చూస్తూ ఉండిపోయింది.  ఈ దృశ్యం చాలామంది సోషల్‌మీడియా వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. రైల్లోకి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ ద్వారం దగ్గర ఉండి ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ఈ కుక్కను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యంతో నవ్వుకుంటున్నారు. ఇకపోతే, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక వైరల్‌ వీడియోని పోస్ట్‌ చేసిన యూజర్..క్యాప్షన్‌లో ఇలా రాశారు.. ముంబైలో లోకల్ ట్రైన్‌లో ప్రతిరోజూప్రయాణించే ట్రావెలర్‌ని కలవండి. మీ వారాంతాన్ని మెరుగుపరచుకోవడానికి ఇదిగోండి! అంటూ క్యాప్షన్ రాశారు. షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోని 8లక్షలకు పైగా వ్యూస్‌తో లక్షల సంఖ్యలో లైకులను సంపాదించుకుంది. కాగా, ఈ సరదా సన్నివేశాన్ని చూసి ఆనందించేందుకు నేను ఖచ్చితంగా బోరివాలి స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుంచి ఏ సమయానికి ఉందో రైలును తెలుసుకోవాలనుకుంటున్నాను.’’ అంటూ పలువురు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..