- Telugu News Photo Gallery Anyone Found Traveling In A Railway Pantry Car Can Be Punished With Imprisonment And Fine Telugu News
Railway Rules: పొరపాటున ఈ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారో ఇక అంతే..! తప్పదు జైలు శిక్షతో పాటు జరిమానా..
మీరు రెగ్యులర్‌గా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు ఈ రైల్వే నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త..!
Updated on: May 22, 2023 | 9:28 PM

రైల్వే రూల్స్: మీరు రెగ్యులర్‌గా రైళ్లలో ప్రయాణిస్తే తప్పనిసరిగా ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. పొరపాటున ఈ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారో ఇక అంతే..! జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదు..

ఇండియన్ రైల్వే అంటే భారతదేశం లైఫ్ లైన్ అని పిలుస్తారు.. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. భారతీయ రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకు కొన్ని రైల్వే రూల్స్ కూడా తెలియవు.

మీరు రెగ్యులర్‌గా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు ఈ రైల్వే నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త..!

ఇంత పెద్ద నెట్‌వర్క్ సజావుగా సాగేందుకు రైల్వే కొన్ని నిబంధనలను రూపొందించింది. మీరు టికెట్ కొనుగోలు చేసిన అదే కోచ్‌లో ప్రయాణించాలి.

రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. రైలులో జనరల్, స్లీపర్, AC క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ఇది కాకుండా, రైలులో ఒక కోచ్ ఉంది, ఇది ఎవరంటే వారు ప్రయాణించటానికి వీలుండదు..ఇది చాలా ఖరీదైనది.

అయితే రైలులో ఇలాంటి ఒక కంపార్ట్‌మెంట్ ఉందని మీకు తెలుసా, అందులో పొరపాటున ఎక్కినా జైలుకు వెళ్లాల్సిందే. ఈ రైల్వే రూల్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి మీరు ఏ రైలు కోచ్‌లో ఎక్కితే మీకు జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి ఇక్కడ ఒక ప్యాంట్రీ క్యాబిన్ గురించి చెబుతున్నాం. ఇతర ప్రయాణికులు రైల్వే ప్యాంట్రీ కార్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లయితే జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది.

రైల్వే నిబంధనల ప్రకారం, రైల్వే ప్యాంట్రీ కారులో ప్రయాణీకులు ఎవరూ ప్రయాణించకూడదు. సిబ్బంది తప్ప ఎవరైనా ప్రయాణీకులు అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

అయితే, వేడి పాలు, నీరు మొదలైన ప్రత్యేక ఆర్డర్‌ల కోసం, మీరు ప్యాంట్రీ కారుకు వెళ్లవచ్చు. కానీ అందులో ప్రయాణించడానికి అస్సలు అనుమతి లేదు.
