Roti Samosa Recipe: మిగిలిపోయిన చపాతీలతో రోటీ సమోసాను ట్రై చేసి చూడండి.. మీ పిల్లలు లొట్టలేసుకొని తినేస్తారు.
మనదేశంలో చాలా మంది రోటీని లంచ్ లేదా డిన్నర్ లో తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇది తేలికైన ఆహారం. ఇందులో అనేకు పోషక విలువలు ఉన్నాయి.

మనదేశంలో చాలా మంది రోటీని లంచ్ లేదా డిన్నర్ లో తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇది తేలికైన ఆహారం. ఇందులో అనేకు పోషక విలువలు ఉన్నాయి. వేడివేడి రోటీలను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కానీ కొన్నిసార్లు రోటీలు మిగిలిపోతుంటాయి. వాటిని మరుసటి రోజు తినేందుకు ఇష్టపడరు. మిగిలిపోయిన రోటీలను వేస్ట్ చేయకుండా…వాటితో రుచికరమైన సమోసాలు తయారు చేయవచ్చు. సమోసాలు అంటే పిల్లల నుంచి పెద్దలకు వరకు ఇష్టపడుతుంటారు. మైదాతో తయారు చేసిన సమోసాలు శరీరానికి హాని చేస్తాయి. మిగిలిన రోటీ నుండి సమోసాలు చేస్తే, అది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పెద్దగా హాని ఉండదు. కాబట్టి, ఆలస్యం చేయకుండా, మిగిలిపోయిన రోటీల నుండి సమోసాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
-రోటీలు – 4




-ఉడికించిన బంగాళాదుంపలు – 2-3
-శనగపిండి – 3 స్పూన్
-పచ్చిమిర్చి ముక్కలు – 2
-ఎర్ర మిరప పొడి – 1/2 tsp
-గరం మసాలా – 1/2 tsp
-కలోంజి – 1/2 tsp
-పచ్చి కొత్తిమీర ఆకులు – 2-3 టేబుల్ స్పూన్లు
-నూనె – వేయించడానికి
-ఉప్పు – రుచికి తగినంత.
రోటీ సమోసాల తయారీ విధానం:
ముందుగా బంగాళదుంపలను ఉడికించి చల్లార్చాలి. ఇప్పుడు వాటి పై తొక్క తీసి బాగా మెత్తగా చేయాలి.ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి, మెంతులు, పచ్చిమిర్చి వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. దీని తరువాత, పాన్లో మెత్తని బంగాళాదుంపలను వేసి, ఒక చెంచా సహాయంతో వేయించాలి. దీన్ని కొన్ని నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు అన్ని మసాలాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది సిద్ధమయ్యాక కొత్తిమీర తరుగు వేయాలి. ఇప్పుడు పక్కన ఉంచి చల్లార్చాలి.
సమోసాలు అంటుకోవడానికి మందపాటి శెనగపిండిని సిద్ధం చేయండి. దీని తరువాత రోటీని మధ్య నుండి కత్తిరించండి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని దాని నుండి ఒక కోన్ తయారు చేసి అందులో బంగాళదుంప నింపండి. చివరగా సమోసా ఆకారంలో ఇచ్చి, శనగపిండి ద్రావణంతో అతికించండి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో రోటీ సమోసాలు వేసి వేయించాలి. చట్నీతో వేడిగా సర్వ్ చేయండి. రుచి అద్బుతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..