Watch: అర్ధరాత్రి ఊళ్లోకొచ్చిన సింహాలు.. ఎద్దును చూసి ప్రాణభయంతో పరుగో పరుగు…
ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని నిర్ణయించుకుంది అంటే చాలు ఇక ఆ జంతువు సింహానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే ఏ జంతువు కూడా సింహం దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసం చేయవు. కేవలం చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, జింకలు, జిరాఫీలను కూడా సింహాలు వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఒక సాధు జీవి ఎద్దును చూసి సింహాలు పరుగులు తీసిన వీడియో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిరోజు లక్షల వీడియోలు సోషల్ మీడియా లో అప్‌లోడ్ అవుతూ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి వీడియోలు ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా ఇలాంటి వీడియో ఒకటి చెక్కర్లు కొడుతుంది. సాధారణంగా అడవికి రారాజు సింహం అని చెబుతారు ఎవరైనా. ఎందుకంటే.. ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని నిర్ణయించుకుంది అంటే చాలు ఇక ఆ జంతువు సింహానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే ఏ జంతువు కూడా సింహం దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసం చేయవు. కేవలం చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, జింకలు, జిరాఫీలను కూడా సింహాలు వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఒక సాధు జీవి ఎద్దును చూసి సింహాలు పరుగులు తీసిన వీడియో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
గుజరాత్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎద్దు సింహాల దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇది. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎద్దును చూసి సింహాలు భయంతో పరుగు తీశాయి. ఏకంగా ఐదు సింహాలు ఎదురుపడినా, ఎద్దు ఏమాత్రం భయపడకుండా వాటిని తరిమి తరిమి పరిగెత్తించింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. అంతేకాదు.. దూరంగా ఆరుబయట నిద్రస్తున్న ఓ వ్యక్తి కూడా తన సెల్‌ఫోన్ ద్వారా ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు. గిర్ అభయారణ్యం సమీపంలో ఉండటంతో….సింహాలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Lions and bulls, Gujarat. ??????? pic.twitter.com/wARIYPoNGT
— Hasna Zaroori Hai ?? (@HasnaZarooriHai) May 17, 2023
సోషల్ మీడియాలో సింహాల దాడికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలాగే ఎద్దు కూడా దూకుడుగా ఉండే జంతువు. అవి నియంత్రణ కోల్పోతే వాటిని ఆపటం చాలా కష్టం అవుతుంది. ఇవి సింహాలతో సహా ఇతర అన్ని జంతువులపై కూడా దాడి చేస్తాయి. పలు సందర్బాల్లో మనుషులపై కూడా దాడి చేసిన సంఘటనలు చూశాం. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఎద్దు సింహాలను పరిగెత్తించటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..