నాకీ పెళ్లొద్దు నాయినోయ్‌.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు!

పెళ్లి మండపానికి వరుడు ఫూటుగా మద్యం సేవించి వచ్చాడు. గమనించిన వధువు దిమ్మతిరిగే షాకిచ్చింది. తాగుబోతుతో నాకీ పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు పెళ్లి రద్దు చేసుకుంది..

నాకీ పెళ్లొద్దు నాయినోయ్‌.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు!
Bride Calls Off Wedding
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2023 | 8:41 AM

పెళ్లి మండపానికి వరుడు ఫూటుగా మద్యం సేవించి వచ్చాడు. గమనించిన వధువు దిమ్మతిరిగే షాకిచ్చింది. తాగుబోతుతో నాకీ పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు పెళ్లి రద్దు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

వారణాసి జిల్లా చౌబేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి మండపానికి వరుడు, అతని బంధువులు పెద్ద ఊరేగింపుగా తరలి వచ్చారు. మండపంలో పెళ్లి తంతు కూడా ప్రారంభమైంది. కాసేపటి తర్వాత వధువును తీసుకొచ్చి వరుడు పక్కన మండపంలో కూర్చోబెట్టారు. వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే సమయానికి వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేయడం ప్రారంభించారు.

మద్యం మత్తులో ఉన్న వరుడి స్నేహితుల చేష్టలు అక్కడున్నవారికి చిరాకు తెప్పించాయి. ఇక వరుడి మెడలో పూల మాల వేస్తున్న సమయంలో అతడూ మద్యం సేవించి ఉన్నట్లు వధువు గమనించింది. అంతే.. వధువు ఆగ్రహంతో పూల మాల విసిరికొట్టి మండపం దిగి విసవిస వెళ్లిపోయింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా వధువు ససేమిరా అనింది. దీంతో చేసేదిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!