G20 Meet in Kashmir: మరోసారి బుద్ధి చూపించిన చైనా.. ‘అది వివాదాస్పద భూమి’ అంటూ పలు దేశాలు సదస్సుకు దూరం..

జమ్ముకశ్మీర్‌ వేదికగా జరుగుతోన్న జీ20 సదస్సు.. సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. భారత్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సులో.. పర్యాటకరంగంపై సోమవారం చర్చించారు. అయితే కొన్ని దేశాలు ఈ సదస్సుకు డుమ్మా కొట్టాయి. మరి జీ20 సదస్సుకు డుమ్మా కొట్టిన దేశాలేవి..? ఇంతకీ అవి ఆబ్సెంట్‌ కావడానికి గల కారణాలేంటి..?

G20 Meet in Kashmir: మరోసారి బుద్ధి చూపించిన చైనా.. ‘అది వివాదాస్పద భూమి’ అంటూ పలు దేశాలు సదస్సుకు దూరం..
G20 Meet In Kashmir
Follow us

|

Updated on: May 23, 2023 | 7:53 AM

G20 Meet in Kashmir: జమ్మూకశ్మీర్‌ వేదికగా జరుగుతోన్న జీ20 సదస్సు.. సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. భారత్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సులో.. పర్యాటకరంగంపై సోమవారం చర్చించారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే, ఈ సదస్సు చైనా, పాకిస్తాన్‌ సహా పలు దేశాలు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద భూ భాగంలో ఇటువంటి సదస్సును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది డ్రాగన్‌ కంట్రీ.

ఇలా తన వ్యాఖ్యలతో మరోసారి భారత్‌పై అక్కలు వెల్లగక్కిన చైనా.. పాకిస్తాన్‌ అనుకూల వ్యాఖ్యలు చేసింది. తమ భూభాగంలో ఎక్కడైనా సదస్సులు నిర్వహిస్తామంటూ.. భారత్‌ కూడా అదే స్థాయిలో రిప్లయ్‌ ఇచ్చింది. ఇక ఇప్పుడు జీ20 సదస్సుకు గైర్హాజయ్యి.. తన బుద్ధి చూపించుకుంది చైనా. ఈ రెండు దేశాలే కాక తుర్కియే, సౌదీ అరేబియా, ఈజీప్ట్, ఇండోనేషియా సైతం.. పలు కారణాలతో ఈ సదస్సుకు హాజరు కాలేదని తెలుస్తోంది.

కాగా, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించాక, అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇది. అందుకే భారత్‌ ఈ సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాల్‌ సరస్సుతో పాటు సమావేశానికి వేదిక అయిన షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే రహదారుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్జీ కమాండోలు, పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆథీనంలోకి తీసుకున్నారు. సదస్సు ముగిసేదాకా శ్రీనగర్‌ నగరాన్ని ‘నో డ్రోన్‌’ జోనుగా ప్రకటించారు. విదేశీ ప్రతినిధులు తిరగాడే మార్గాలను అందంగా అలంకరించారు. అనుమానాస్పద అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌, వదంతుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..