- Telugu News Photo Gallery Cricket photos MI and RCB: 3 former MI players who are now with RCB for IPL 2023
IPL 2023, MI & RCB: బెంగళూరు తరఫున ఆడుతున్న ముంబై మాజీ ప్లేయర్లు.. వీళ్లతోనూ రోహిత్ సేన ‘ప్లేఆఫ్స్’కి గండం..
గుజరాత్‌పై విజయం సాధించి రోహిత్ సేనను ప్లేఆఫ్స్ నుంచి తొలగించాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ముగ్గురు మాజీ ఆటగాళ్ళు ఇప్పుడు ఆర్‌సీబీ శిబిరంలో ఉన్నారు.
Updated on: May 21, 2023 | 8:59 PM

ఐపీఎల్ 2023: ఐపీఎల్ లీగ్ దశ దాదాపుగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాయి. ఇక 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొంది.

లీగ్ 69వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. మరోవైపు 70వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ముంబై స్థానాన్ని ఆక్రమించాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే ముంబై ఇండియన్స్‌తో సమానంగా 16 పాయింట్లు ఉంటాయి. అయితే ముంబై ఇండియన్స్ కంటే ఆర్‌సీబీ రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందున బెంగళురు టీమ్ నాల్గో ప్లేఆఫ్స్ ఆడుతుంది.

ఈ ఉత్తేజకరమైన దశలో.. గుజరాత్‌పై విజయం సాధించి రోహిత్ సేనను ప్లేఆఫ్స్ నుంచి తొలగించాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ముగ్గురు మాజీ ఆటగాళ్ళు ఇప్పుడు ఆర్‌సీబీ శిబిరంలో ఉన్నారు. మరి ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

1: గ్లెన్ మాక్స్‌వెల్: RCB తరఫున ‘కేజీఎఫ్’లో భాగంగా ఉన్న స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అలాగే రోహిత్ శర్మ నాయకత్వంలో 3 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 36 పరుగులు చేశాడు.

2: దినేష్ కార్తీక్: RCB వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ దినేష్ కార్తీక్ కూడా 2012, 2013 ఐపీఎల్ సీజన్‌లలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అలాగే ముంబై తరఫున 19 మ్యాచ్‌లు ఆడిన డీకే మొత్తం 510 పరుగులు చేసి రాణించాడు.

3: కర్ణ్ శర్మ: RCB జట్టులోని లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడే. 2017లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన కర్ణ్ శర్మ 13 వికెట్లు పడగొట్టి రాణించాడు.




